
నెల్లూరు ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకుని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జపం చేస్తున్నారని జనసేన నెల్లూరు జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా విమర్శించారు. శుక్రవారం నగరంలోని జనసేన జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రెండు రోజుల క్రితం సామర్లకోటలో జరిగిన సభలో సీఎం జగన్ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామన్నారు. సభ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడడం దారుణమన్నారు. సీఎం జగన్ ఏమి సందేశమిస్తారని లక్షలాది మంది ప్రజలు ఎదురుచూశారని అన్నారు. కానీ జగన్ మాత్రం పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఆయన వ్యక్తిగత జీవితం వల్ల పరిశ్రమలు వెనక్కి వెళ్లాయా, రాష్ట్రం అధోగతిపాలైందా, రోడ్లు గుంటలు పడ్డాయా అని ఆయన ప్రశ్నించారు. తాము మోసపోయాం బాబో అని ప్రజలు అనుకుంటున్నారన్నారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలకు ఏమి చేశారో తెలపాలని డిమాండ్ చేశారు. 2024లో జరగబోయే ఎన్నికల్లో కేవలం వైసీపీకి 20నుంచి 30 స్థానాలు మాత్రమే వస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. గత 6 నెలల నుంచి ఏమి అభివృద్ధి చేశారో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం వివరించాలన్నారు. మంత్రి రోజా .. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేకప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ఈసారి రోజాకు నగరిలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. మహిళా జాతికే రోజా మాట్లాడిన మాటలు అవమానకరమన్నారు. ఈ సమావేశంలో జనసేన నేతలు, వీర మహిళలు, యశ్దాని, మంజూలమ్మ, సునంద, సుల్తానా తదితరులు పాల్గొన్నారు.