విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ తన కార్యాలయం నుంచి విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ ఈరోజు అమరావతిలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నగరానికి సంబంధించినటువంటి పేద మధ్యతరగతి మహిళలకు ఎవరికి కూడా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయలేదని, ఈరోజు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. కేవలం వైసీపీ నాయకులకి, కార్యకర్తలకి వాలంటీర్లకి మాత్రమే అని మీరు విజయవాడ నగరంలోని మహిళలును పెద్ద ఎత్తున మోసం చేశారని అర్హుల జాబితాలో బీసీ ,ఎస్టీ మైనార్టీ మహిళ యొక్క పేర్లను పెద్ద యెత్తున తొలగించరని అన్నారు. తొలగించిన జాబితాలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు వాలంటీర్ల పేర్లను చేర్చిన మాట ముమ్మాటికి నిజం అని వైసిపి నాయకుల మాటల్ని గాని, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని గాని విజయవాడ నగర మహిళలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సభను విజయవంతం చేయడానికి నిన్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అందరూ కూడా నైట్ డ్యూటీ చేశారని వారు సీఎం గారి సభకు బలవంతంగా జనాన్ని బస్సుల్లో తరలించడానికి అష్ట కష్టాలు పడ్డారని ఈరోజు సీఎం గారి సభలో పాల్గొన్నది సామాన్య ప్రజలే అని సెంటు భూమి పథకం కింద లబ్ధి పొందిన లబ్ధిదారులు మాత్రం కాదని అదే విధంగా సెంటు భూమి పథకం పేరుతో విజయవాడ నగరంలో 12,000 మందిని జక్కంపూడి లో నిర్మించిన టిత్కో గృహ సముదాయానికి దూరం చేసినది వైసిపి నాయకులు సీఎం జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. వారి సొంత ఇంటి కలకు దూరం చేసినటువంటి మాట ముమ్మాటికి నిజం అని గత ప్రభుత్వంలో నిర్మాణం 80% పూర్తి చేశారని మిగిలిన 20 శాతం పూర్తి చేయడానికి ఈ వైసీపీ ప్రభుత్వానికి నాలుగున్నర ఏళ్ల సమయం చాల లేదా అని గతం లో విజయవాడ నగర మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున 25 వేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు చెల్లించారని ఈరోజుకి వారికి టిట్కో ఇళ్లు రాకుండా వారు గృహప్రవేశాలు చేయనీయకుండా ఇప్పటికీ వాయిదాలు వడ్డీలు చెల్లించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటే అది కేవలం వైసీపీ నాయకులు వల్ల సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వల్లేనని, పశ్చిమ నియోజకవర్గంలో ఇంతవరకు కేటాయించిన ఇళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించలేకపోయారంటే స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఏ స్థాయిలో ఆ సమర్ధుడో పశ్చిమ నియోజకవర్గం లోని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. నిర్మాణంలో పూర్తి చేయడంలో పట్టించుకోనటువంటి ఈ అసమర్థ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మాకు అవసరం లేదని పశ్చిమ నియోజకవర్గం ప్రజలు అందరూ కూడా ముక్తకంఠంతో తెలియజేస్తున్నారని అన్నారు. అదే విధంగా ఈ రోజున అమరావతిలో సెంటు భూము కింద ఇల్లు పొందిన లబ్ధిదారులలో స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుకి చెందిన బంధువులు చుట్టాలు ఆయన చుట్టూ తిరిగే వ్యక్తులే పెద్ద ఎత్తున లబ్ధి పొందారని దీనికి నిన్న ఈనాడు శీర్షికలో ప్రచురణమయిన ఆర్టికల్ నిదర్శనం. ఈ అంశం మీద వైసిపి నాయకులు మాట్లాడకుండా ఉన్నారంటే పెద్ద ఎత్తున సెంటు భూమి పథకంలో వైసిపి నాయకులు లబ్ధిదారులుగా ఉన్నారని అర్థమవుతుందని , సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సభలో పదేపదే నా ఎస్టి నా బిసి నా మైనార్టీ అని మాట్లాడుతున్నారని సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు మీరు అగ్రవర్ణ కులం నకు చెందినవారు అని మీరు పదేపదే నా ఎస్టీ నా బిసి నా మైనార్టీ అని మాట్లాడే అర్హత మీకు లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీరు నా పేదింటి వారు అని కూడా మాట్లాడుతున్నారని లక్ష కోట్లు, నాలుగు ప్యాలస్లున్న మీరు ఏ విధంగా పేదవారు అవుతారని దీనికి మీరు సమాధానం చెప్పాలని బీసీలను ఎస్టీలను మైనార్టీలను దారుణంగా మోసం చేసిన మీరు నా ఎస్ లు,నా బీసీలు నా మైనార్టీ కు అనడానికి మీకు ఏమాత్రం అర్హత లేదని ఈ రోజున జోగి రమేష్ సభలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని జోగి రమేష్ గారికి గతంలోనే చెప్పానని నీ పేరు జోగి రమేష్ కాదని నీ పేరు జోకర్ రమేష్ అని నువ్వు కారులో వెళ్తే బీసీ మహిళలు , ఎస్సీలు ఎస్టీలు లేచి నిల్చవాలా అని అటువంటి నువ్వు పేదవారి గురించి మాట్లాడతావా అని నీలో పెత్తందారు లక్షణాలు పూర్తిగా ఉన్నాయని అవినీతి సొమ్ముతో కొవ్వెక్కి నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని నువ్వు మంత్రి అయ్యాక కోట్ల రూపాయలు అవినీతి సొమ్ముతో హైదరాబాద్ వెళ్లి భూములు కొంటున్న మాట వాస్తవం కాదా అని ? నీలాంటి వ్యక్తులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరికనేది లేదని మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ కోటలు బద్దలు కొట్టి ఏదో సాధించేశారు అన్నట్లుగా మాట్లాడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లి ఏం సాధించారని ప్రత్యేక హోదా ఏమైనా సాధించారా?, విభజన హామీలు సాధించారా? పోలవరం పూర్తి చేశారా?, రైల్వే జోన్ సాధించారా? ఇవేమీ చేయని జగన్ మోహన్ రెడ్డి గారు ఢిల్లీ కోటలు బద్దలు కొట్టారని పొగుడుతూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మీరు ఢిల్లీ కోటలు బద్దలు కొట్టడం కాదు రాష్ట్ర ఖజానాని బద్దలు కొట్టారని లక్షల కోట్లు కాజేసారని పేద ప్రజల జీవితాన్ని అస్తవ్యస్తం చేశారని నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించకుండా పక్క రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి వారికి తీసుకొచ్చారని పెట్టుబడులు పరిశ్రమలు రాకుండా అడ్డుపడ్డారని మీరు మోహన్ రెడ్డి గారి గురించి పొగడ్తలతో ముంచేత్తేతే జగన్మోహన్ రెడ్డి గారు మీకు సీట్ ఇస్తారని ఎన్నికలకు ఫండ్ స్తారని ఉద్దేశంతో కావాలంటే మీరు ఆయనకి భజన చేసుకోండి గాని ప్రజల్ని పక్కదారి పట్టించే లాగా అబద్ధపు ప్రచారం చేస్తే రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరని రాబోయే ఎన్నికల్లో మీకు కచ్చితంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సమావేశంలో కొరగంజి వెంకటరమణ, ఆకుల రవిశంకర్, శ్రీను,సోము మహేష్, పవన్ కళ్యాణ్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com