Logo
Date of Publish : 09 June 2022, 3:16 pm
Editor : Sake Naresh

175 సీట్లు గెలుస్తామంటున్న సీఎం జగన్ భ్రమల్లో నుండి బయటపడాలి : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

- కనీస అభివృద్ధి కూడా చేయకుండా ఏ ముఖం పెట్టుకుని గడపగడపకు ప్రజల్లో తిరగాలో అర్థం కాక ఎమ్మెల్యేలు అల్లాడుతున్నారు
-175 సీట్లు ఏమి ఖర్మ, తెలంగాణ రాష్ట్రంలో ఉండే 119 సీట్లను కూడా కలుపుకుని మొత్తం 294 సీట్లు వైసీపీవే అని భజన చేయించుకోండి
- కొందరు ఎమ్మెల్యేలు వాలంటీర్లను, సచివాలయ ఉద్యోగులను, పోలీసులను వెంటేసుకుని వెళ్ళి ప్రజల్ని భయపెడుతున్నారు
- సీఎంకి జోస్యం చెప్పే ఐప్యాక్, ఆ ప్యాక్, ఈ ప్యాక్ టీములు కాదు... ప్రజలందరూ ఆ ప్యాక్ లను ప్యాక్ చేసి కట్టగట్టి పడేసారు
- ఏ ఇంటికి ఎంత ఉచితాలు పడ్డాయో చెప్పే సర్వే ఏజెంట్లుగా ఎమ్మెల్యేలు మారిపోయారు తప్ప అభివృద్ధి చెప్పి ప్రజాసమస్యలు కనుక్కోలేకున్నారు
- పవనన్న ప్రజాబాటలో ఎద్దేవా చేసిన జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి
- గడపగడపకు ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్, పవనన్న ప్రజాబాట సూపర్ హిట్... ప్రజలందరూ పవనన్నే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్న కేతంరెడ్డి వినోద్ రెడ్డి
       నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 24వ రోజున 4వ డివిజన్ మైపాడు గేట్ సెంటర్, శ్రీరామ్ నగర్ కాలనీలో జరిగింది. ఈ ప్రాంతంలోని పలు వీధుల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల సమస్యలను కనుక్కున్న కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు అందరినీ కూర్చోపెట్టుకుని క్లాసు పీకి 175 సీట్లు గెలుస్తున్నాం అని ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 175 సీట్లు ఏమి ఖర్మ, తెలంగాణ రాష్ట్రంలో ఉండే 119 సీట్లను కూడా కలుపుకుని మొత్తం 294 సీట్లు వైసీపీనే గెలిచేస్తుంది అని భజన చేయించుకోవచ్చు అని ఎద్దేవా చేసారు. ఐప్యాక్ టీములు, ఆ ప్యాక్ టీములు అంటూ జోస్యం చెప్పించుకుంటున్న సీఎం జగన్ గారు భ్రమలు వీడి వాస్తవంలో ఉండాలని కేతంరెడ్డి సూచించారు. ప్యాక్ టీములన్నింటినీ ప్రజలు ఏనాడో ప్యాక్ చేసేశారని, కట్ట కట్టి పడేశారని, వాలంటీర్లను వెంటేసుని ప్రజాభిప్రాయ సేకరణ చేయించుకుంటూ వాపుని బలం అనుకుంటున్నారని దుయ్యబట్టారు. తాను నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 24 రోజులుగా ప్రతి ఇంటికి తిరుగుతున్నానని, ఇప్పటికి సుమారు 5000 ఇళ్ళు తిరిగితే, అత్యధిక ఇళ్ళల్లో ఆనేక సమస్యలు చెప్పారన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో పేదవారు కాని, మధ్యతరగతి వారు కాని, డబ్బున్న వారు కాని, ఎవ్వరూ కూడా సుఖ సంతోషాలతో లేరని దుయ్యబట్టారు. మాజీమంత్రి స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గడప గడపకు తిరగట్లేదని ముఖ్యమంత్రి జగన్ అసహనం వ్యక్తం చేసినట్లు కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయని, మూడేళ్ళు నెల్లూరు నగరాన్ని కనీస అభివృద్ధి కూడా చేయకుండా ఎమ్మెల్యే అనిల్ ఏ ముఖం పెట్టుకుని తిరుగుతారని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం అని అన్నారు. ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెడితే వారు తిరగొచ్చు కానీ వాస్తవ పరిస్థితులు సీఎంకు అర్థం కావని అన్నారు. ఎందుకంటే ఇప్పుడు గడపగడపకు తిరిగే ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ వారితో ఒక 50 మంది వాలంటీర్లను, 50 మంది సచివాలయ ఉద్యోగులను, 20 మంది పోలీసులను వెంటేసుకుని ,మందీ మార్బలంతో తిరుగుతున్నారని, ప్రజలు భయాందోళనకు గురవుతారు తప్పించి తమ సమస్యలు చెప్పుకుంటారా అని ప్రశ్నించారు. ఏ ఇంటికి ఎంత ఉచిత డబ్బులు పడ్డాయో కనుక్కునే సర్వే ఏజెంట్లుగా ఎమ్మెల్యేలు మారిపోయారు తప్పించి, తాము చేసిన అభివృద్ధిని చూపించి ప్రజలకు ఏమైనా ఇతర సమస్యలు ఉంటే తీర్చే పరిస్థితి లేదని, అందుకే సీఎం జగన్ ఆదేశించినా కూడా గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయిందని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. తాము చేస్తున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమానికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోందని, ప్రజలందరూ వారి సమస్యలను చెప్తున్నారని, జనసేన పార్టీ అధికారంలోకి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఖచ్చితంగా కాబోయే సీఎం పవనన్నే అని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com