అనంతపురం ( జనస్వరం ) : రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారు. అమ్మ ఒడి లబ్ధిపై కాకి లెక్కలు చెబుతున్నారని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ జయరామిరెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వ బహిరంగ సభలో స్కూలు పిల్లల ముందర నా వెంట్రుకలు ఎవరు పీకలేరు పరుష ప్రసంగాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. సెలవులలో ఉన్న పిల్లలకు స్కూల్ డ్రెస్సులు వేసి బలవంతంగా బహిరంగ సభకు పిలిపించి వారి ముందు. రాజకీయ ఉపన్యాసాలు, ప్రతిపక్ష నాయకులు విమర్శించడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లలో 72 లక్షల 46 వేల మంది ఉన్నారని చెప్పారు. మహా అయితే ఇంటర్మీడిట్ పిల్లలు రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మంది ఉంటారు. తను మాత్రం 82, 81,502 మంది పిల్లలకు పథకాన్ని బటన్ నొక్కి అందజేసిన అంటున్నారు. అంటే మొత్తం మీరు రాష్ట్రంలో ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలందరికీ డబ్బులు ఇచ్చారా మీరు చెప్పే లెక్కల ప్రకారంగా.. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న పిల్లలు కేవలం కోటి మంది లోపలే ఉన్నారు… ఇందులో సగం మందికి పైగా మీరు డబ్బులు ఇవ్వట్లేదు. 82 లక్షల మందికి ఇచ్చామని కాకి లెక్కలు దొంగ లెక్కలు చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు అని స్పష్టంగా అర్ధమైందన్నారు. పేరుకేమో 15000 ఇస్తామని అందులో 2000 కోత విధిస్తున్నారు. మీరు ఇస్తున్న 15000 డబ్బు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంతకేంద్ర ప్రభుత్వం వాటా ఎంత సర్వ శిక్ష అభియాన్ నుంచి రాష్ట్రానికి అందుతున్న నిధులు బహిర్గతపరచగలరా… సీఎం హోదాలో సభ్యత సంస్కారం తో మాట్లాడలి. పిల్లల ముందు నా వెంట్రుకలు ఎవరూ పీకలేరు అనడం దుర్మార్గమైన నీచమైన హేయమైన చర్య అని జనసేన ‘జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి దుయ్యబట్టారు.