Search
Close this search box.
Search
Close this search box.

ఈ రాష్ట్రం నెత్తిమీద జేష్ఠ దేవిని కూర్చోబెట్టిన దరిద్ర పుత్రుడు సీఎం జగన్ : పోతిన వెంకట మహేష్

పోతిన వెంకట మహేష్

                  విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ తన కార్యాలయం నుంచి విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ ఈ రాష్ట్రం నెత్తిమీద జేష్టాదేవి కూర్చోబెట్టిన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి గారు దారిద్ర పుత్రుడని, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, అందరూ కూడా పేదరికంతో, దుఃఖంతో, వికారంతో, బతుకుతున్నారంటే కారణం సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన వల్లే అని, ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. జగన్‌ గారు చేపట్టే బటన్‌ నొక్కుడు వల్లే ఆంధ్రప్రదేశ్‌ మొత్తం అదోగతి అయిందని, అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, 2019 ముందు కేవలం రాష్ట్ర అప్పులు రూ. రెండున్నర లక్షల కోట్లు అయితే ఈ రోజు రాష్ట్ర అప్పులు రూ.8.5లక్షల కోట్లకి చేరడం వాస్తవం కదా అని, జగన్‌ గారు సమాధానం చెప్పాలని బటన్‌ నొక్కడం తోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అప్పుల ఊబీలో కూరుకుపోయిందని ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, మరోపక్క రాత్రి, పగలు తేడా లేకుండా జగన్‌ మోహన్‌ రెడ్డి గారు దోచుకుంటున్నారని  పగలు ఏమో మద్యం అమ్మకాలు, అక్రమ నిర్మాణాలు, గనులు దోచుకోవాడం, కొండలను పిండి చేసేటువంటి కార్యక్రమాలు చేపట్టాలంటే రాత్రిపూట అక్రమంగా ఇసుకని ఇతర రాష్ట్రాలకు తరలించడం, గంజాయిని అమ్మకాలు ఇష్టానుసారం సాగుతోందని, ఈ విధంగా రాత్రి, పగలు తేడా లేకుండా రాష్ట్రాన్ని జగన్మోహన్‌ రెడ్డి గారి బందిపోటు ముఠా దోచుకుంటోందని అన్నారు. వీళ్ల ధన దాహం ముందు బంగాళాఖాతం కూడా చిన్నదవుతుందని, ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఈ ఆంధ్రప్రదేశ్‌ ని అప్పుల ఆంధ్ర ప్రదేశ్‌ గా మార్చిన ఘనుడు జగన్‌ మోహన్‌ రెడ్డి గారు అని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రోత్‌ రేట్‌లో నెంబర్‌ వన్‌ అంటా..! అభివృద్ధి అంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఏమైనా వచ్చాయా..? ఉద్యోగాలు ఏమైనా వచ్చాయా..? ఉపాధి అవకాశాలు కలిగాయా..? సమాధానం చెప్పలని, రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్లలేదు.. అప్పుల్లో, క్రైమ్‌ రేట్‌లో ముందుకు పోయిందన్నారు. జగన్మోహన్‌ రెడ్డి గారికి దమ్ముంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడులు ఏంటి..? పరిశ్రమలు ఏంటి..? ఉద్యోగం ఏంటి..? అనే దానిమీద శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతిసారి మాటలు మాట్లాడే ముందు నా బిసి.. నా ఎస్సీ.. నా ఎస్టీ.. నా ముస్లిం మాట్లాడుతున్నారని, ప్రభుత్వం నుంచి వచ్చిన పదవులన్నీ మీ సామాజిక వర్గానికి కదా సలహాదారు పదవి ఎవరికి ఇచ్చారు..? టీటీడీలో పదవి ఎవరికి ఇచ్చారు..? వైస్‌ ఛాన్స్లర్‌ పదవి ఎవరికి ఇచ్చారు..? నామినేటెడ్‌ పదవులు మొత్తం కూడా సామాజిక వర్గానికి కేటాయించి, ఇప్పుడు మాత్రం నా ఎస్సీ.. నా బిసి.. నా ఎస్టీ.. నా ముస్లిం అని నమ్మించి మోసం చేస్తున్నటువంటి మీ నిజ స్వరూపాన్ని ఎస్సీ, ఎస్టీ, ముస్లిం అందరు కూడా గ్రహించారని, రాబోయే ఎన్నికల్లో మీకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అదే విధంగా వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఓటమి తధ్యం ఈ రాష్ట్రం వదిలి పారిపోయి కోస్టారికాలో కూడా తల దాచుకుంటారని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారని, కనీసం ఈ ఒక్క ఏడాది జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి ఒక యువతికి నాలుగు ఉద్యోగాలు అన్న ఇస్తారని ప్రజలు భావిస్తున్నారని. ఈ బందిపోట్ల పాలన పోవాలంటే ఏ రాష్ట్రం అప్పుల నుంచి బయటకు రావాలంటే రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే నిజాయితీ పరుడైన పవన్‌ కళ్యాణ్‌ గారికి ప్రజలందరూ కూడా అండగా నిలబడాలని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way