Search
Close this search box.
Search
Close this search box.

బీసీల వెన్నుపూస విరిచిన బీసీ వెన్నుపోటు దారుడు సీఎం జగన్

• బీసీలను బిచ్చగాళ్ళుగా మార్చి జయహో బీసీ అని నాటకాలు ఆడుతున్నారు.
• బీసీల హృదయంలో సీఎం జగన్ కు స్థానం లేదు.
• బీసీ సంక్షేమశాఖ అనాధ సంక్షేమ శాఖగా మారిపోయింది.
• జయహో బీసీ సభలో పాల్గొన్నది బీసీలు కాదు.
• సీఎం జగన్ కు వారి సొంత సామాజిక వర్గంపై ఉన్న ప్రేమ బీసీలపై లేదు.
• బీసీలకు ఒక్క కొత్త పథకమైన ప్రకటించారా?
• బీసీలకు మాటల్లో వాటాలిస్తూ చేతల్లో మోసం చేస్తున్నారు.
• 56 బీసీ కార్పొరేషన్ లు జగన్ భజన చేయడానికే.
• కుల చేతివృత్తులను నిర్వీర్యం చేశారు
          విజయవాడ, (జనస్వరం) : పశ్చిమ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జనసేనపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి పోతిన మహేష్‌ మాట్లాడుతూ జగన్ తన రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని, వెనుకబడిన కులాలే వెన్నుముక అంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తూ బీసీలకు స్థానిక సంస్థలు ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్లు తగ్గించి 16,800 మంది బీసీలను అధికారానికి దూరం చేసి బీసీల వెన్నుపూస విరిచిన బీసీ వెన్నుపోటు దారుడు జగన్ అని, జగన్ పాలనలో బీసీలు ఓడిపోయారు. కుల చేతివృత్తులు నాశనమై ఆదరణ లేక మనుగడ సాగించలేక చతికిలపడి ఓడిపోయారని, బీసీల బడ్జెట్ను 4 ఏళ్ళ లో 25000 కోట్లు పక్కదారి పట్టించి బీసీల జీవితాలను అతలాకుతలం చేసిన వ్యక్తి సీఎం జగన్ అని, బీసీ మహిళలంటే జగన్ కు చులకన అందుకనే పెళ్లి కానుక పథకం, విదేశీ విద్య, విద్యోన్నతి ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్ పథకాలను రద్దు చేశారని ,బీసీలకు ఒక్క కొత్త పథకమైన జగన్ ప్రకటించారఅని ?. సీఎం జగన్ ఒక సామాజిక వర్గానికి ముఖ్యమంత్రుల వ్యవహరిస్తున్నారని, బీసీలను మాత్రం బానిసల్లా చూస్తున్నారని, రాష్ట్రంలో ఒక్క బీసీ భవన్ నిర్మాణమైన చేపట్టారా 139 బీసీ కులాల్లో ఒక్క సామాజిక వర్గానికైనా కమ్యూనిటీ భవన్ నిర్మాణం చేపట్టారని, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని మాటల్లో వాటాలిస్తూ చేతల్లో మోసం చేస్తున్న మాయగాడు సీఎం జగన్ అని, సీఎంకు తన సామాజిక వర్గం మీద ఉన్న ప్రేమ అభిమానం వారి పట్ల ఉన్న విలువ బీసీలపై లేదని, అందుకనే పనికిరాని పదవులు బీసీలకు అధికారం ఆర్థిక బలం బడ్జెట్ అన్న పదవులు తన సొంత సామాజిక వర్గం వారికి ఇచ్చారని, 56 బీసీ కార్పొరేషన్ లో కేవలం జగన్ భజన చేయడానికి పనికొస్తున్నాయని, 56 బీసీ కార్పొరేషన్లకు బిక్షగాళ్లకు చిప్పలో చిల్లర వేసిన విధంగా ఒకటి రెండు లక్షల కేటాయించి ఇంత దారుణంగా అవమానిస్తారా అని?. నిధులు విధులు లేని 56 బీసీ కార్పొరేషన్ లో ఎందుకు అని బీసీ సంక్షేమ శాఖ రాష్ట్రంలో అనాధ సంక్షేమ శాఖ గా మారిపోయిందని, బీసీల అభివృద్ధి సంక్షేమం గురించి కనీసం ఒక్క నిమిషమైనా ఆలోచించే అధికారం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకి లేదని, ఆయనకి నిత్యం ఇతర పార్టీలపై విమర్శలు చేయడానికి జగన్ ని పొగడ్డానికి తప్ప ఆయనకి వేరే బాధ్యత లేదని, నిజంగా జగన్ కి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రతి బీసీ కుటుంబానికి ఉద్యోగం ఉపాధి కల్పించాలని, ఈ బోడి నవరత్నాలతో ఎవరికీ పనిలేదని, నవరత్నాల వల్ల ఒక్క బీసీ జీవితం కూడా అభివృద్ధి చెందలేదని, బీసీ విద్యార్థుల మెడపై కత్తి పెట్టి ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి తూట్లు తోట్లు పొడిచి బీసీ విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసి పొమ్మనకుండానే పొగ పెట్టి బీసీ ఉన్నత విద్యను అభ్యసించే తల్లితండ్రులను అప్పులు పాలు చేసిన ఘనత సీఎం జగన్ దే అని, జగన్ పాలంలో బీసీల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని, కుల చేతివృత్తుల ధ్వంసం అయ్యాయి వారికి ఆకలి దరిద్రం వలసలు ఆత్మహత్యలే శరణ్యమయ్యాయని, సీఎం జగన్ బీసీల గ్రామస్థాయి నాయకత్వాన్ని చంపేస్తున్నారు. 10 శాతం రిజర్వేషన్లు తగ్గించి బీసీలు సర్పంచులుగా కూడా ఉండద్దని జగన్ అడ్డుకోవడం దుర్మార్గంమని, బీసీల అంటే జగన్ ఎందుకింత వ్యతిరేకత సమాధానం చెప్పాలని, బీసీల ఆధీనంలో ఉన్న ఎనిమిది వేల ఎకరాల అసైన్డ్ భూములను జగన్ ప్రభుత్వం లాక్కొని సెంటు భూమి పథకానికి మళ్ళించారని, బీసీలను భూమిలేని పేదలుగా మార్చి బానిసలుగా తయారు చేస్తున్నది జగన్ కాదా అని ? సబ్ ప్లాన్ నిధులు 35 వేల కోట్ల రూపాయలు దారి మళ్ళిన మాట నిజం కాదా అని, జయహో బీసీ సభ నిర్వహించే సత్తా బీసీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మంత్రులకు, చైర్మన్ లకు లేదు కేవలం విజయసాయిరెడ్డి కే ఉందా అంటే బీసీలను ఎంత హీనంగా చూస్తున్నారో బీసీలు అర్థం చేసుకొని జగన్కు సరైన సమయం లో బుద్ధి చెప్పాలని, ఈరోజు సభలో పాల్గొన్నది బీసీలు కాదని , విజయవాడ నుండి చుట్టుపక్కల ప్రాంతాల నుండి 500 రూపాయలు బిర్యాని ఆశ చూపించి సభకు తీసుకొచ్చారని, కెపాసిటీ 25 వేల మంది మాత్రమే 86,000 మందికి ఎలా సర్దుబాటు చేస్తారని, అంబేద్కర్ మహనీయులు లాంటి వారితో జగన్మోహన్ రెడ్డి కి పోలికా? అని, సంఘసంస్కర్తని ఆర్ కృష్ణయ్య కొనియార్ధం చాలా దుర్మార్గంమని, బీసీలను అన్ని రకాలుగా మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహిఅని, “నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్” బీసీలను ఇంతలా మోసం చేసే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తి మరొకరు ఉండరని, బీసీల హృదయంలో జగన్ కి స్థానం లేదని, బీసీల వెన్నుపోటు దారుడుగా, బీసీల ద్రోహిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని మహేష్ అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నగర అధికార ప్రతినిధి స్టాలిన్ శంకర్ డివిజన్ అధ్యక్షులు కొరగంజి వెంకటరమణ, నగర సంయుక్త కార్యదర్శి సాబింకర్ నరేష్, హనుమాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way