
విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఈరోజు తన కార్యాలయం నుంచి విడుదల చేసిన పత్రిక ప్రకటన మరియు ఇదే అంశాలను ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.
అమ్మవారి ఆలయ నిధులను స్వాహా చేస్తున్న సీఎం జగన్. ఈ ఏడాది మే నెలలో మంత్రి కొట్టు సత్యనారాయణ తన పదవిని కాపాడుకునేందుకు రాజశ్యామల సుదర్శన యాగం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కాంప్లెక్స్ లో నిర్వహించారు.
• అందుకు అయిన ఖర్చును రాష్ట్రంలో ప్రధాన దేవాలయాలన్నీ భరించాయి. అయినా చెల్లింపులు ఇంకా పూర్తికానందున అమ్మవారి ఆలయం నుంచి అదనంగా మరొక 45 లక్షల 82 వేల రూపాయలు చెల్లించాలని మంత్రి కొట్టు సత్యనారాయణ ఒత్తిడి మేరకు ఎండోమెంట్ కమిషనర్ ఆగస్టు 25వ తేదీన అమ్మవారి ఆలయ ఈవోను చెల్లింపులు చేయాలని ఒక సర్కులర్ జారీ చేశారు.
• ఎండోమెంట్ కమిషనర్ కు అసలు అధికారం లేదు అక్రమంగా సర్కులర్ జారీ చేసినందున వారిపై తక్షణమే కేసు నమోదు చేయాలని అమ్మవారి ఆలయ ఈవో భ్రమరాంబ గారు పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
• ఆలయ ఈవో భ్రమరాంబ గారు 45లక్షల82000 ఏవిధంగా చెల్లింపులు చేస్తారో భక్తులకు సమాధానం చెప్పాలి అమ్మవారి ఆలయ నిధులను దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదు. అమ్మవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం.
• నాలుగు కోట్ల రూపాయలు విలువచేసే ఫెర్గులా రాతి స్తంభాలను కనకదుర్గ నగర్ లో ఎవరి అనుమతితో తొలగిస్తున్నారు ఈవో భ్రమరాంబ గారు ?సమాధానం చెప్పాలి. ఎవరికి అడ్డం వచ్చాయి ఏ షాపుల వారికి ఇబ్బంది ఉందని ఇప్పుడు అర్జెంటుగా తొలగిస్తున్నారు.
• అమ్మవారి పాలకమండలి చైర్మన్ ఏం చేస్తున్నారు. ఫోటోలు దిగడం ఫోజులు ఇవ్వడం తప్ప మీరు ఆలయంలో ఏం వెలగబెడుతున్నారో భక్తులకు సమాధానం చెప్పాలి.
• అమ్మవారి ఆలయం నిధులను అక్రమంగా 45 లక్షల 82 వేల రూపాయలు చెల్లింపులు చేయాలని ఎండోమెంట్ కమిషనర్ సర్కులర్ జారీ చేస్తే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? కనకదుర్గ నగర్ లో 4 కోట్ల రూపాయలు విలువైన పేర్గొలా రాతి స్తంభాలను తొలగిస్తుంటే వెళ్లి ఫోటోలు దిగుతారా? పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు భక్తులకు సమాధానం చెప్పాలని తెలిపారు.