విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ తన కార్యాలయం నుంచి విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ విజయవాడ నగరంలోని పేద సామాన్య ప్రజల మధ్య సీఎం జగన్ చిచ్చు పెడుతున్నారని, ముందుగా సెంటు భూమి ఇళ్ళ పట్టాలు తీసుకోవడమే విజయవాడ నగరంలోని పేద సామాన్య ప్రజలు చేసిన పాపమా? అని విజయవాడ నగరంలోని ఇల్లు లేని పేదలందరినీ ఒకేలా చూడాలన్నారు. ఒకే విలువైనటువంటి సెంటు భూమిని పంపకం చేయాలని, విజయవాడ నగరంలోని పేద ప్రజలందరికీ విజయవాడ నగరంలోని ఇళ్ళ పట్టాలివ్వాలని, నా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ముస్లింలకు అగ్రవర్ణ పేదలకు విజయవాడ నగరంలోనే ఇళ్ళ పట్టాలివ్వాలని, విజయవాడ నగరం నడి బొడ్డున ఉన్న PWD గ్రౌండ్స్, సీబార్ డిస్నీల్ ల్యాండ్, సితార సెంటర్ మరియు నిరుపయోగంగా ఉన్నటువంటి ఇతర ప్రభుత్వ స్థలాల్లో విజయవాడ నగరంలోని పేద సామాన్య వర్గాలకు ఇక్కడే ఇళ్ల పట్టాలి ఇవ్వాలని అన్నారు. విజవాడ నగరంలోని పేదలు ఏం పాపం చేశారని, ముందుగా ఇళ్ళ పట్టాలు తీసుకోవడమే నేరమా? అని ముందుగా తీసుకున్న పేదలకు సామాన్యులకు వెదురుపావులూరు, కొండపావులూరు, వెలగలేరు, ముస్తాబాద్, సూరంపల్లి, కంకిపాడు, వణుకూరులో ఇచ్చారు కానీ ఇప్పుడున్న వారికి మాత్రం అమరావతిలో ఇచ్చారని అన్నారు. ఆస్తి విలువలో భారీ వ్యత్యాసం ఉంటుంది కదా పేదల మధ్య చిచ్చు పెడతునరని, సీఎం జగన్ గారు అందరికీ ఒకే విలువైనటువంటి సెంటు భూమి ఇవ్వచ్చు కదా అని అన్నారు. ఇళ్ల పట్టాలిచ్చిన వారిలో మెజారిటీ లబ్ధిదారులు వైసీపీ నాయకుల కార్యకర్తలేని, విజయవాడ నగరంలోని పేదలందరికీ ఒకేలా చూడాలి ఒకే విలువైనటువంటి సెంటు భూమిని పంపకం చేయాలని సామాజిక న్యాయం అంటున్నారు కానీ ఇదేం సామాజిక న్యాయం సీఎం జగన్ గారు సమాధానం చెప్పాలన్నారు. ముంపు ప్రాంతానికి గురయ్యే ప్రాంతంలో సెంటు భూమిచ్చి అక్కడ నిర్మాణం చేసుకున్న వారికి ఒక విలువ అమరావతిలో సెంటు భూము తీసుకున్నారు కి మరొక విలువ ఉంటుందని ఇది సామాజిక న్యాయం అవుతుందా సామాజిక ద్రోహం అవుతుందో మీరు సమాధానం చెప్పాలని, గతంలో రాజధాని అమరావతి ప్రాంతంపై అనేక ఆరోపణలు చేశారన్నారు. అమరావతి దండగ అన్నారు నేడు అమరావతిలో పట్టాల పండుగ అంటున్నారని, ఇదేం దుర్మార్గం? అమరావతి ప్రాంతం నిర్మాణానికి పనికిరాదన్నారని నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందన్నారనీ ముంపు ప్రాంతం అన్నారనీ స్మశానమన్నారని ఎడారి అన్నారనీ సంవత్సరానికి నాలుగు పంటలు పండే ప్రాంతం అన్నారని మరి నేడు ఏ ప్రాతిపదికన అమరావతి ప్రాంతంలో పట్టాలు పంచుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఒకవేళ కోర్టులో తీర్పు అనుకూలంగా రాకపోతే ఈ పేదల పరిస్థితి ఏంటో సమాధానం చెప్పాలి. పేదల జీవితాలతో చెలగాట మారదు జగన్ గారు ఇది మంచిది కాదనీ మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తుందని హెచ్చరించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com