- జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన మహేష్
విజయవాడ, (జనస్వరం) : సీఎం జగన్ రెడ్డికి మహిళా దినోత్సవాన్ని నిర్వహించే అర్హత లేదని జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన మహేష్ అన్నారు. మహిళలకు ఈ ప్రభుత్వంపై నమ్మకం పోయిందని, మహిళల అభివృద్ధి సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందనడానికి నిదర్శనం పెళ్లి కానుక పథకం, సబ్సిడీ రుణాలు మంజూరు, విదేశీ విద్యా పథకం రద్దు చేయడమేనన్నారు. జన్మనిచ్చిన తల్లికి, తోడబుట్టిన చెల్లికి అన్యాయం చేసిన సీఎం జగన్ ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పిస్తారంటే నమ్మే స్థితిలో మహిళలు లేరని తెలిపారు. అందుకే మహిళలపై దాడులు చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. మహిళా సాధికారతకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com