– సంక్రాంతి సంస్కృతి, సాంప్రదాయాలకు భిన్నంగా విష సంస్కృతులకు వ్యసనాలకు ఆంధ్రప్రదేశ్ నిలయంగా మార్చేశారు.
– సంక్రాంతి ముసుగులో సీఎం జగన్, సజ్జల, వైసిపి నాయకులు ప్రజల నుంచి వందల కోట్లు కొల్లగొట్టారు.
– ప్రతి బరికి ఒక ప్యాకేజ్ సీఎం కు 50 శాతం సజ్జలకు 20 శాతం వైసీపీ నాయకులకు, పోలీస్, రెవిన్యూ కు 30 శాతం వాటాలు
– కత్తులు తగిలి మరణించిన రాజేష్ పద్మారావులవి ప్రభుత్వ హత్యలే
విజయవాడ, (జనస్వరం) : పాములు కాలువ దగ్గర హత్యల వరకు దారి తీసిన ఘటన పై పోలీసుల మౌనం దేనికి సంకేతమని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ అన్నారు. మంగళవారం తన కార్యాలయం నుంచి విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ని జూదాంధ్రప్రదేశ్ గా సీఎం జగన్ మార్చేశారని, సంక్రాంతి సంస్కృతి సాంప్రదాయాలకు భిన్నంగా విష సంస్కృతులకు వ్యసనాలకు ఆంధ్రప్రదేశ్ నిలయంగా మార్చేశారని, సంక్రాంతి ముసుగులో సీఎం జగన్, సజ్జల, వైసిపి నాయకులు ప్రజల నుంచి వందల కోట్లు కొల్లగొట్టారని, కోడి పందాలు ముసుగులో బరులు చుట్టూ జరిగింది గుండాట, పేకాట, మూడుముక్కలాట, కోతాట లేఅని, ప్రతి బరికి ఒక ప్యాకేజ్ అని, సీఎం కు 50 శాతం సజ్జలకు 20 శాతం వైసీపీ నాయకులకు, పోలీస్, రెవిన్యూకు 30 శాతం వాటాలు పంచుకున్నారని, రాష్ట్రంలో మద్యం ఏరులై పారిందని, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లన్నీ విచ్చలవిడిగా అమ్ముడుపోయాయని, వందల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి కాదని జగన్మోహన్ రెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి చేరాయని, డప్పు పిచ్చితో జగన్మోహన్ రెడ్డి ప్రజలను వ్యసనపరులను చేస్తున్నారని, రాష్ట్రంలో 32 లక్షల మంది నిరుద్యోగు యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక కోడి పందాల బరుల చుట్టూ గుండాట పేకాట మద్యం సిగరెట్లు గంజాయి అమ్ముకొని సంఘ వ్యతిరేక శక్తులుగా తయారవుతున్నారని, ప్రజలు పక్షాన ఉన్న ప్రతిపక్ష నేతల పై పోలీసులు కేసులు పెడుతున్నారని, మరి సమాజాన్ని సర్వం నాశనం చేస్తున్న గుండాట పేకాట కోతముక్కలపై ఎందుకు మౌనం వహించారో డిజిపి చెప్పాలని, ప్రతి ఒక్కరికి ఒక ప్యాకేజీ చొప్పున అధికారులు, అధికార పార్టీ నేతలు వసూలు చేశారని, బరులు ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో పందాలు జోరుగా సాగాయని, కత్తులు తగిలి మరణించిన రాజేష్ పద్మారావు లవి ప్రభుత్వ హత్యలే అని, ఇక్కడ జీవో నెంబర్ వన్ పని చేయదా? అని, కోడిపందాల వద్ద గొడవలు హత్యలు వరకు దారి తీశాయని, మరి నిఘా వ్యవస్థ ఏమైందని, జగన్, సజ్జల ప్రమేయంతోనే ఇన్ని కోట్లు పందాలు ఆడారని, పాములు కాలువ దగ్గర హత్యల వరకు దారి తీసిన ఘటన పై పోలీసుల మౌనం దేనికి సంకేతమని, విజయవాడ పోలీసు కమిషనర్ దీనిపై స్పందించాలని మహేష్ డిమాండ్ చేశారు.