రాజంపేట ( జనస్వరం ) : రాష్ట్ర అభివృద్ధి గాలికి వదిలేసి అవ్వ, తాతల పెన్షన్ల కోతలో నిమగ్నమైన సీఎం జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించిన రామ శ్రీనివాస్. అన్నమయ్య జిల్లా కేంద్రం నుండి రాయచోటి పార్టీ కార్యాలయంలో జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాల కాలం అవుతున్నా ప్రజా అవసరాలను మరియు ప్రజాసంక్షేమ, ప్రజాశ్రేయస్సును పక్కన పెట్టారన్నారు. రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధిని మరిచి అవ్వ, తాతల పెన్షన్ల కోతలో నిమగ్నమైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రజలను ముఖ్యంగా వృద్ధుల, వితంతువుల పెన్షన్లు తీసివేయడం వారికి నోటీసు ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. ముఖ్యంగా వృద్ధులు వితంతువులు వారికి ఏ ఆసరా లేక ఈ పెన్షన్ పైన ఆధారపడి ఉన్నారు. అటువంటి వారికి మీరు ప్రభుత్వం తరపు నుంచి నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సబబు అని జనసేన తరఫున మేం ప్రశ్నిస్తున్నామని అన్నారు. ఈ నోటీసులు వెనక్కి తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున మీరు తక్షణమే ఈ నోటీసులపైన వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇన్ని నెలలుగా పెన్షన్లు తీసుకుంటున్న వారు ఇప్పుడే ఎలా అనర్హులయ్యారు అని జనసేన తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామశ్రీనివాస్, జిల్లా జనసేన కార్యక్రమాల సభ్యులు షేక్ రియాజ్ పాల్గొన్నారు.