
“సీఎం.. డౌన్ డౌన్..” అంటూ మార్మోగిన ఇంద్రకీలాద్రి
– అరగంటపాటు భక్తుల నినాదాలు
– హిందూ ప్రజల మనోభావాల పట్ల సీఎంకు చిత్తశుద్ది ఉంటే.. వెల్లంపల్లి వెల్లంపల్లి శ్రీనివాస్ ని బర్తరఫ్ చేయాలి
– దసరా ఉత్సవాల తొలి రోజు నుంచి చివరి వరకు అన్నీ అనర్ధాలే
– దసరా ఉత్సవాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం
విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దసరా ఉత్సవాల నిర్వహణలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘోరంగా వైఫల్యం చెందారన్నారు. ఆయన దండుపాళం గ్యాంగ్ కు కాంట్రాక్టులు కట్టబెట్టి దోచుకోవడంపైనే దృష్టి పెట్టారని ఎద్దేవా చేశారు. అందుకే ఈ యేడాది అధికారుల మధ్య సమన్వయం లేకుండా పోయిందన్నారు. దసరా ఉత్సవాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట మసకబారిందని, సామాన్య భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని, అమ్మవారి ఆలయ చరిత్రలో ఓ సీఎంను ముప్పై నిమిషాల పాటు డౌన్ డౌన్ అని నినదించిన అంశం ఎప్పుడూ లేదని తెలిపారు. దసరా రోజు.. అరగంట పాటు భక్తులుతో ఆవేదనతో డౌన్ డౌన్ అన్నారంటే.. అసమర్ధ మంత్రి వెల్లంపల్లి చేతకాని తనమే కారణంమన్నారు. హిందూ ప్రజల మనోభావాల పట్ల సీఎం కు చిత్తశుద్ది ఉంటే.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కోట్ల రూపాయలు దోచుకుంటున్నట్లు ఆధారాలతో ఉన్నా.. సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దసరా ఉత్సవాల తొలి రోజు నుంచి చివరి వరకు అన్నీ అనర్ధాలనేని, మొదటి రోజున అంతరాలయ ప్రాంగణంలో ఎలక్ట్రిషన్ మృతి చెందడం, అన్యమత ప్రచారం, మూలానక్షత్రం రోజున మతవిద్వేషాలు రెచ్చగొట్టే లాగా ఘాట్ రోడ్డుపై బ్యానర్లు ఏర్పాటు, చివరి రోజున గంటల పాటు భక్తులను నిరీక్షించేలా చేసి.. ఇబ్బందులు పెట్టి సీఎం జగన్ ని డౌన్ డౌన్ అనే స్థాయికి తీసుకుకెళ్లారంటే.. మంత్రి వెల్లంపల్లి, అధికారులను ఏమనాలని ప్రశ్నించారు. ఓ ప్రముఖ ఐఏఎస్ అధికారి కూతురు అంతరాలయంలో కూర్చుని గంటలు గంటలు పూజలు చేయడం వాస్తవం కాదా అని అన్నారు. పండితులు వద్దని నివారించినా అధికారులు ఎందుకు ప్రోత్సహించారని అడిగారు. అసలు ఎటువంటి పూజలు చేశారో.. విచారించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.