అనంతపురం రూరల్ ( జనస్వరం ) : అనంతపురం రూరల్ మండల పరిధిలోని కందుకూరు, మన్నేల గ్రామపంచాయతీ నందు స్వచ్భత హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి నరసింహారెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ పరిధిలోని పారిశుద్ధ్యం మీద అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. పాఠశాలలోని విద్యార్థులు, పంచాయతీ ప్రజలచే మానవహారం చేపట్టారు. అనంతరం వీరందరిచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీ, పాలకవర్గం సభ్యులు, సచివాలయం సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ఐక్య సంఘం సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.