పిఠాపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు పీ.ఎస్.ఎన్.మూర్తి టీం పిఠాపురం టౌన్ 10వ వార్డు మిరపకాయల వీధిలో 25 మంది ఒంటరి మహిళల అక్క చెల్లెమ్మలకు క్రిస్మస్ కానుకగా బియ్యం కూరగాయలు కిరాణా ఇవ్వడం జరిగింది. అక్క చెల్లెమ్మలు అందరు కూడా ఇప్పటివరకు ఏ నాయకుడు కూడా మమ్మల్ని పట్టించుకునే దాఖలాలు లేవని అన్నారు. జనసేన పార్టీ వాళ్లు వచ్చి మాకు ఇంత ప్రేమ చూపించి మమ్మల్ని ఆదుకున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. చుట్టుపక్కల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈసారి తప్పకుండా జనసేన పార్టీ అధికారంలో వచ్చే దిశగా మేము కూడా పనిచేస్తామని వాపోయారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడిని ఈసారి తప్పకుండా చూడాలని ఆశగా ఉందని ప్రజలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, టైల్స్ బాబి, పెంకే జగదీష్, యండ్రపు శ్రీనివాస్, పబ్బిరెడ్డి ప్రసాద్, నామ శ్రీకాంత్, పిఎస్ఎన్ మూర్తి, నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.