క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, ఐక్యతకు ప్రతీక - "రాక్" సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శిఖా శాంసన్.
సత్తెనపల్లి,డిసెంబర్25.(జనస్వరం)
క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, ఐక్యతకు ప్రతీక అని లోక రక్షకుడైన ఏసుక్రీస్తు జన్మించిన పవిత్ర దినమని రాక్ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శిఖా శాంసన్ అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సత్తెనపల్లి పట్టణంలోని నిరాశ్రయులకు,దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు.

లోకానికి శాంతిని, ప్రేమను, కరుణను పంచడమే క్రీస్తు బోధనలు సారాంశమని ఆయన గుర్తు చేశారు.అన్ని మతాల పండుగలను సమానంగా గౌరవిస్తూ ఐక్యత ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాక్ సేవా సంస్థ కార్యకర్తలు సాల్మన్, రమేష్,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.