
ఒంగోలు ( జనస్వరం ) : జనసేన పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు అడుసుమల్లి వెంకట్రావు గారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి జనసేన పార్టీ కట్టుబడి ఉందని, రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వంలో వాడవాడలా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుందామని అనీ అన్నారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి చనపతి రాంబాబు గారు మాట్లాడుతూ ఆ ప్రభువు చూపిన మార్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తామని, పేద ప్రజలకు అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమం లో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శి గోవింద్ కోమలి, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు ఆకుపాటి ఉష, నరేష్ గంధం, షేక్ సుభాని, వీర మహిళలు మాదాసు సాయి నాయుడు, సుంకర కళ్యాణి, 28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్, 49వ డివిజన్ అధ్యక్షులు మాల్యాద్రి నాయుడు, మరియు జనసేన నాయకులు భాయ్రెడ్డి వేణు, బండారు సురేష్, చంగళశెట్టి రాఘవ, జనసేవ శ్రీనివాస్, ఉంగరాల వాసు, యాదల సుధీర్, నరసింహారావు, శ్రీను కర్రీ, కర్రీ శ్రీకాంత్, శ్రీపాద సాయి, అనుదీప్, కిరణ్, సింగరాజు తేజ, అగరం అజయ్, యు.అవినాష్ తదితరులు పాల్గొన్నారు.