చిట్వేలి ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకుడు మాదాసు నరసింహ ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ మండల విస్తృత సమావేశము జరిగినది. ఈ సమావేశoలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మరియు రాయలసీమ జోన్ 1 కన్వీనర్ జోగినేని మణి, కో కన్వీనర్ పగడాల వెంకటేష్ లు ముఖ్య అతిధులు గా పాల్గొన్నారు. ముందుగా నూతనంగా పదవులు పొందిన జోగినేని మణి, పగడాల వెంకటేష్ లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా అతిధులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు అందరం సమిష్టిగా అధిష్టానం ఆదేశానుసారం, బూత్, పంచాయతి స్థాయి పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్ళాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా సభాధ్యక్షుడు మాదాసు నరసింహ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల కార్యక్రమాల కమిటీ జనసేన పార్టీ రాయలసీమ జోన్ కన్వీనర్ గా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నియమితులైన జోగినేని మణి, కో కన్వీనర్ పగడాల వెంకటేష్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన పదవిని ఒక బాధ్యతగా అనుకొని అప్పజెప్పిన కర్తవ్యాన్ని భాధ్యతతో రానున్న ఎన్నికల్లో జనసేన-టిడిపి ఉమ్మడి ప్రభుత్వం స్థాపించేందుకు ఈ కమిటీ సభ్యులందరూ కృషి చేసి జనసేన పార్టీని విజయతీరాలకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదినేని నరేష్, కంచర్ల సుధీర్ రెడ్డి, షేక్ రియాజ్, తుపాకుల పెంచలయ్య, మాదాసు శివ, పగడాల శివ, పగడాల చంద్ర, కావేరి అవినాష్, వరికుట్టి నాగరాజు, రాగిపాటి విజయ్, గుగ్గిళ్ళ సుబ్బరాయుడు, పగడాల మని, ప్రసాద్ జడల సతీష్ కుమార్, శ్రీకారపు ప్రకాష్, సవరం సాయి పురం గోపాల్, ఆర్ సురేష్, సువ్వారపు హరిప్రసాద్, మలిశెట్టి ప్రణీత్, పృథ్వి రాజ్, మాదినేనిరాజా శివ శంకర్, రాఘవ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.