చిత్తూరు ( జనస్వరం ) : నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ ఆరణి కవిత రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి వర్కర్లు చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా అంగన్వాడి వర్కర్లు చేస్తున్న నిరవధిక సమ్మెకు జనసేన తరఫున మద్దతు ప్రకటించారు. ఆరణి కవిత మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనాన్ని 26వేలకు తగ్గకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడి వర్కర్లు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె న్యాయమైనదని వారికి ప్రస్తుతం ఇస్తున్న 11 600 రూపాయల గౌరవ వేతనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎటు సరిపోదని వారు కోరినట్టుగా వారికి 26 వేల రూపాయల కనీస వేతనాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా అంగన్వాడి ని వర్కర్లకు FRS యాప్ లాంటి వివిధ రకాలైనటువంటి యాప్లను ఉపయోగించమని చెప్తూ టెక్నికల్ పనులు కూడా వారితో చేయించుకోవడం దారురణమైన చర్య అని చెప్పారు. అంగన్వాడీ వర్కర్లు చేస్తునటువంటి చిన్నపిల్లలకు పోషకాహారం అందించడంలో, గర్భిణీ స్త్రీలకు పోషకాహారం అందించడంలో వారి యొక్క సేవ అభినందనీయమని కొనియాడారు. ఇప్పటి వరకూ నియోజకవర్గంలోని మండల స్థాయి అధికారులు కానీ నియోజకవర్గస్థాయి అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు గాని వీరు చేస్తున్న సమ్మెను సందర్శించిన పాపాన పోలేదని విమర్శించారు. ప్రభుత్వం వీరు న్యాయబద్ధంగా చేస్తున్నటువంటి సమ్మెకు సానుకూలంగా స్పందించి వెంటనే వారి డిమాండ్లను తీర్చాలని వారికి కనీస వేతనం 26 వేల తో పాటు రిటైర్మెంట్ సదుపాయాలు కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని స్పందించకపోతే జనసేన తెలుగుదేశం తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆరణి కవిత గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పుష్ప, డేగల యుగంధర్, నానబాల లోకేష్, ఆవుల రమేష్, యువనాయకులు లోచన్, శ్రీరామ్ కనిష్క, ధీరజ్ దుద్ది, వీరం వినోద్, వీరమహిళలు, ఆరణి అంజలి, శిరీష తదితరులు పాల్గొన్నారు.