చిత్తూరు ( జనస్వరం ) : పలమనేరు నియోజకవర్గం బైరెడ్డి పల్లె మండలం లక్కనపల్లి జనసేన అభ్యర్థి మధుసూదన్ గ్రామ సర్పంచ్ గా పోటీ చేయడంతో కార్యకర్తలు తీవ్రంగా దాడి చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ గ్రామానికి వెళ్ళి గాయపడిన జనసేన నాయకులను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ నాయకుల, కార్యకర్తల దాష్టీకాలకు అంతు లేకుండా పోయిందని అన్నారు. రోజు రోజూకి గ్రామాల్లో వైసీపి పార్టీకి ఆదరణ తగ్గడంతో ఇలా ప్రత్యర్థుల మీద దాడులకు దిగుతున్నారు. 151 మంది ఎమ్మేల్యేలు గెలిచినా ఇంకా భయంగా గడుపుతూ మా పార్టీ కార్యకర్తల మీద దాడికి దిగుతున్నారు. మేము మా నాయకుడు ఇచ్చిన ఆదేశానుసారంగా ఓపికతో ఉన్నామని, మా సహనాన్ని పరీక్షించవద్దని అన్నారు. మేము ప్రత్యక్ష రంగంలోకి దాడులకు దిగితే మాకు, మీకు తేడా ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఆకేపాటి సుభాషిణి, రాయలసీమ కో – కన్వీనర్ రామదాస్ చౌదరి, తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్, కుప్పం నియోజకవర్గ ఇంచార్జి వెంకట రమణ, జిల్లా సంయుక్త కార్యదర్సులు కీర్తి, పసుపులేటి దిలీప్, పూల చైతన్య మోహన్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు