Logo
Date of Publish : 14 February 2022, 5:51 pm
Editor : Sake Naresh

చంద్రగిరి నియోజకవర్గంలో మండల కమిటీ నిర్మాణ ప్రక్రియను ప్రారంభించిన చిత్తూరు జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు Dr పసుపులేటి హరిప్రసాద్

     తిరుపతి, (జనస్వరం) : చంద్రగిరి నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షులు డా పసుపులేటి హరిప్రసాద్ గారి ఆదేశాల మేరకు, నియోజకవర్గ నాయకులు శ్రీ దేవర మనోహర, మండల అధ్యక్షులు రాయల్ వెంకట్ గారి ఆధ్వర్యంలో తిరుపతి రూరల్ మండలంలో మండల కమిటీ ఎంపిక ప్రక్రియ సమావేశం నిర్వహించి మండల కమిటీ సభ్యులను ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని 2024 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడటమే ధ్యేయంగా, పార్టీ మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్న జిల్లా కార్యవర్గమని ఇందులో భాగంగా ఈరోజు తిరుపతి రూరల్ మండలం, తిరుచానూరు పంచాయితీలో మండల కమిటీ ప్రక్రియ నిర్వహించారు. అలాగే ఏ విధమైన సమస్యపై ప్రజల తరపున పోరాడటానికి జనసేనపార్టీ అండగ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, చిత్తూరు జిల్లా లీగల్ విభాగం ఉపాధ్యక్షురాలు శ్రీమతి కంచి శ్యామల, జిల్లా కమిటీ జనరల్ సెక్రెటరీ చిన్నా రాయల్, సంయుక్త కార్యదర్శి కీర్తన, దండు లక్ష్మీపతి, రాంబాబు, ఆషా, ప్రతాప్ రెడ్డి, నరేష్, మురళి, పవన్, సాయి, మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com