చిత్తూరు, (జనస్వరం) : జిల్లాల పేర్ల మార్పు నిరంతర ప్రక్రియ అని ఆరు నెలలు పోతే మరో జిల్లా పేరు మార్చొచ్చంటు మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల్లో ఏదో మర్మం దాగుంది. జిల్లా పేరు మార్పు పేరుతో కోనసీమలో పెట్టిన చిచ్చు చాలు. ఇకనైనా రాష్ట్రంలో కొత్త జిల్లా రణ హోమాలు, మారణహోమాలు ఆపాలని అనిత పేర్కొన్నారు. ప్రజల దృష్టి మరల్చే ఇటువంటి కుట్రలు ఆపేసి ఎన్నికలకు ముందు వైకాపా అధ్యక్షుడు హోదాలో జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన సిపిఎస్ రద్దుపై దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి ఈ విషయం గురించి ఎవరితోనో మాట్లాడించడానికి బదులు తానే బహిరంగంగా సిపిఎస్ రద్దు చేయలేమని పొరపాటున హామీ ఇచ్చామని తప్పు అయిపోయిందని చెబితే ప్రజలు ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటారని అన్నారు. మంత్రి విశ్వరూప్ ఇంట్లోని వారందరిని బయటకు పంపించిన పోలీసులు అక్కడే తుపాకులు ఎందుకు వదిలేశారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. కాలిపోయిన ఇల్లు మంత్రి సొంతిల్లు కాదని మంత్రి కొత్తగా కట్టుకున్న ఇల్లు పైన కాలి పోవడం తప్ప లోపల ఏమీ కాలేదని ఇవన్నీ పలు అనుమానాలకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు. ఆ ప్రాంతానికి చెందిన వైకాపా బీసీ సెల్ అధ్యక్షుడు మురళీకృష్ణనే కోనసీమ జిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షుడు కావడం, అన్యం సాయి పెట్రోలు పోసుకొని నిప్పంటించుకుంట అని చెప్పడం వల్ల వేళ్ళనీ ఆ వైపు చూపుతున్నాయి. నెల్లూరు నుండి ఇ ఒక వాలంటీరు 50 మందిని కోనసీమకు ఒక్కరోజు ముందు తీసుకొచ్చి లాడ్జిలో ఉంచారు. డి.ఎస్.పి నీ రాళ్లతో గాయపరచిన వారిలో ఉన్నట్లు సమాచారం. ఈ విధంగా వైకాపా ప్రభుత్వం నీచమైన చర్యలకు పాల్పడి మళ్లీ ఈ సంఘటనకు కారణం జనసేన అని చెప్పడాని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ పాలనలో రాష్ట్రంలో అనూహ్యమైన మార్పులు ప్రజలు చూస్తున్నారు. కేవలం వైకాపా రెండు వర్గాల మధ్య ఘర్షణ నలు పెట్టడానికే ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడింది, తప్ప జనసేనకు ఎటువంటి సంబంధమూ లేదని తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com