తిరుపతి, (జనస్వరం) : విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి తిరుపతి పట్టణంలో TMR కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి జనసేన పార్టీ PAC సభ్యులు చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ.డా.పసుపులేటి హరి ప్రసాద్ జనసేన పార్టీ తరుపున రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, జిల్లా కార్యదర్శి దేవర మనోహర్ తో కలిసి విశాఖ ఉక్కు పరిశ్రమకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా డా.పసుపులేటి హరి ప్రసాద్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గతంలో విశాఖపట్టణంలో విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు పైన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కార్మికులకు పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారనీ గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు విశాఖ ఉక్కు సాధించుకునే వరకు పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు. అలాగే జనసేన నాయకులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఎంతోమంది ఆత్మగౌరవం దెబ్బతింటుంది అని ముందుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కేంద్రానికి వినతిపత్రం ద్వారా అందజేసి, ఒకరోజు దీక్ష చేసి నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి సోషల్ మీడియా మాధ్యమాలలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ప్రజల ద్వారా కేంద్రానికి తెలియజేయడం జరిగిందని, జనసేన పార్టీ విశాఖ ఉక్కు పరిశ్రమకు ఎప్పుడు మద్దతుగా నిలుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులతో పాటు జనసేన పార్టీ తిరుపతి పట్టణ అధ్యక్షులు రాజా రెడ్డి, జిల్లా నాయకులు హేమ కుమార్, కీర్తన, మరియు విజయలక్ష్మి , సుమన్ బాబు, అరుణ, అమృత, మునస్వామి, కిషోర్, యశ్వంత్, రమేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com