పిఠాపురం ( జనస్వరం ) : యూ కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామంలో ఉదయ్ కుమార్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ గ్రామ సీనియర్ ప్లేయర్ ఆధ్వర్యంలో 2024 జనవరి 12 న ప్రారంభం అయిన ఉదయ్ కుమార్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు నిర్వహించడం జరిగింది. మొత్తం 48 జట్లు టోర్నమెంట్ లో పాల్గొనగా చిత్రాడ కు చెందిన చిత్రాడ సీపీ హార్డ్ హిట్టర్స్ 11 జట్టు మరియు రమణక్కపేట11 జట్టు ఫైనల్ కు చేరడం జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో సి పి చిత్రాడ హార్డ్ హీటర్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా గ్రామ పెద్దలు హాజరై విన్నర్ మరియు రన్నర్స్ కు ట్రోఫీ మరియు క్యాష్ ప్రైజ్ అందించడం జరిగింది. ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన చిత్రాడ జగదీష్ 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు రన్నర్ గా నిలిచిన రమణక్కపేట జట్టుకు 6000 రూపాయల క్యాష్ ప్రైజ్ అందించడం జరిగింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా కుమార్ నిలిచారు ఈ మ్యాచ్ లో ముందుగా చిత్రాడ 12 ఓవర్లకు 104 -8 పరుగులు చేయగా రమణక్కపేట 33 -10 ఆల్ అవుట్ అవటం జరిగింది ఈ సందర్భంగా చిత్రాడ జట్టు కెప్టెన్ జగదీష్ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ చాలా అద్భుతంగా కండక్ట్ చేస్తూ ఆర్గనైజింగ్ ఎంపైరింగ్ ఇబ్బంది లేకుండా చక్కగా నిర్వహించారని అభినందనలు తెలియజేస్తూ అలాగే మా జట్టు సీనియర్ ఆటగాళ్లు మాస్టారు, శివ నాగు, సత్తి, జాన్, కుమార్,పండు, భవాని, కృష్ణ, వెంకటరత్న, వీరు, హేమంత్, శ్రీను, రాజేష్, వీరబాబు, సూరిబాబు, గణేష్, పి.వి, శ్రీను, బౌలింగ్ బ్యాటింగ్ లో మంచి ప్రదర్శన చూపించి ఫైనల్లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేయడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com