Logo
Date of Publish : 23 August 2022, 1:37 am
Editor : Sake Naresh

వీరఘట్టం మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో చిరంజీవి జన్మదిన వేడుకలు

     వీరఘట్టం, (జనస్వరం) : పార్వతీపురం మన్యం జిల్లా, వీరఘట్టం మండలం, నడుకూరు గ్రామంలో మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ సినీనటులు, మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి మనవసేవా సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం సాయి మారుతి ధ్యాన మందిరంలో జనసేన పార్టీ నాయకులు, మెగాస్టార్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ముందుగా నిర్వాహకులు ఉదయాన్నే చిరంజీవి పేరిట గోత్రనామాలతో శ్రీ ఆంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యఅతిధిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి సీనియర్ అభిమాని, చిరంజీవి మనవసేవా సంఘం అధ్యక్షుడు, జనసేన పార్టీ నాయకులు బి.పి.నాయుడు కేక్ కట్ చేసి చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ప్రారంభించారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ చిరంజీవి స్వయంకృషితో ఎవ్వరి సహకారం లేకుండా సినీపరిశ్రమలో కష్టపడి మెగాస్టార్ స్థాయికి ఎదిగిన మహానుభావుడని, సమాజం మనకి ఏమిచ్చిందని కాకుండా సమాజానికి మనమేమి చేసాం అనే ధోరణిలో గొప్ప ఆలోచనచేసి, తమ అభిమానులను సైతం సేవామార్గంలో నడిపించే గొప్ప మనసున్న మగమహారాజు అని, అందుకే చిరంజీవి భారతదేశమే కాకుండా ప్రపంచం గర్వించదగ్గ గొప్ప నటుడు చిరంజీవి అని అన్నారు. మరో విశిష్ట అతిధిగా హాజరైన జనసేనపార్టీ నాయకులు జనసేన జాని మాట్లాడుతూ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆశయాలను సేవారూపంలో ప్రజల్లోకి తీసుకెల్తూ సమాజాసేవలో మెగాఫ్యామిలీ అభిమానులే ముందున్నారని అంటూ మెగాభిమానులు చేసే సేవలను కొనియాడుతూ ఇంతగొప్ప సేవామూర్తి చిరంజీవికి భారతరత్న ఇచ్చి ఆయన్ను గౌరవించిన నాడే తనసేవలకు సార్ధకత అని అన్నారు. అనంతరం చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా వృద్ధులకు పళ్ళు,రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన క్రియాశీలక సభ్యులు మత్స పుండరీకం, కంటు మురళి, మత్స.కృష్ణా రావు, వాన కైలాష్, చిన్ని, కర్నేన సాయి పవన్, కోడి వెంకటరావు నాయుడు, అభిమానులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com