Logo
Date of Publish : 23 August 2022, 1:53 pm
Editor : Sake Naresh

కర్నాటకలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు

      కర్ణాటక ( జనస్వరం ) : అఖిల కర్నాటక పవన్ కళ్యాణ్ జనసేన టీమ్ మరియు అఖిల భారత చిరంజీవి యువత నాయకులు ఉమేష్,  బాలాజీ నాయుడు, అభిమానులు ఆధ్వర్యంలో కర్నాటక వైట్ ఫీల్డ్ లో కర్నాటక డాన్సు అకాడమి లో మెగా స్టార్ చిరంజీవి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ  కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, జిల్లా సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, వైట్ ఫీల్డ్ ఏరియా ప్రముఖులు మరియు డాన్సు అకాడమీ పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిధులు, కార్యక్రమం నిర్వాహకులు మాట్లాడుతూ కల్మషం లేని మనస్తత్వం వున్న మహానుభావులు చిరంజీవి అని, కష్టపడి ఒక్కో అడుగు వేసుకుంటూ నేడు మెగాస్టార్ గా ప్రఖ్యాతిగాంచి ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. తనకు ఆ స్థాయి ఇచ్చినటువంటి తన అభిమానులకు తన వంతుగా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ అదేవిధంగా వైద్య సేవలు అందించడానికి ఒక ఆసుపత్రి నిర్మాణానికి నడుం బిగించిన మన మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి కేక్ కట్ చేసి అన్నదానం కార్యక్రమం చేపట్టారు. తదుపరి పారిశుద్ధ్య కార్మిక మహిళలు కు నూతన వస్త్రాలు అందజేసి అతిధులను గౌరవప్రదంగా సన్మానించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com