Logo
Date of Publish : 28 April 2022, 2:30 am
Editor : Sake Naresh

గురువులను సత్కరించిన చిరంజీవి యువత

     విజయనగరం, (జనస్వరం) : అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపకులు, రవణం స్వామి నాయుడు పిలుపు మేరకు మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన "ఆచార్య" చిత్రం విడుదల సందర్బంగా బుధవారం ఉదయం కామాక్షి నగర్, శ్రీ లక్ష్మి గణపతి ఆలయంలో 9 మంది గురువులకు సన్మాన కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా చిరంజీవి యువత, అంజనీపుత్ర చిరంజీవి ప్రజా సేవాసంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ ప్రపంచంలోనే మెగాభిమానులను సేవా మార్గంలో నడిపించడమే కాకుండా, ఆధ్యాత్మిక మార్గమైతేనేమి, సంస్కారమంతమైన, విలువలుతో కూడిన సాంప్రదాయాలతో మెగాభిమానులను పోషించే ఘనత కేవలం మెగాఫ్యామిలీ అభిమానులకే చెల్లుతుందని, కేవలం అఖిల భారత చిరంజీవి యువత, వ్యవస్థాపకులు రవణం స్వామి నాయుడు సారథ్యంలో ఇటువంటి మహోన్నతమైన గురువులను సత్కరించే బృహత్కర కార్యక్రమం నిర్వహించడం పూర్వజన్మ సుకృతంగా మా మెగాభిమానులంతా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా చిరంజీవి యువత మరియు జనసేన నాయకులు, అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవసంఘం అధ్యక్షులు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, కార్యదర్శి, జిల్లా చిరంజీవి యువత డిజిటల్ కోఆర్డినేటర్ లోపింటి కళ్యాణ్, జనసేన యువనాయకుడు క్లబ్ ఉపాధ్యక్షులు చెల్లూరి ముత్యాల నాయుడు, కోశాధికారి పళ్లెం కుమారస్వామి, సభ్యులు అలబోయిన శివ, పతివాడ శ్రీను తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com