ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కరోనా రోగులకు ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వాలు సైతం ఒకానొక దశలో చేతులెత్తేసిన పరిస్థితి. ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి గారు, తన తనయుడు రాం చరణ్ గారు కలసి ప్రారంభించిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. మొట్టమొదటగా కర్నాటక రాష్ట్రంలో చింతామణిలో ఏర్పాటు చేయడం ఆనందదాయకం. మెగా అభిమానులు మరియు జనసైనికులు మాట్లాడుతూ ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయడం వలన కొద్దిమందికైనా ప్రాణాలు నిలబెట్టగలవచ్చు. అభిమానులు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉత్సాహా౦ చూపుతున్నారు. మొదటగా ఇక్కడ స్టార్ట్ చేయడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తూ, మెగా కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటామని అన్నారు. అలాగే జనసైనికులు కూడా గతంలో రెండు తెలుగు రాష్ట్రాలలో 800+ ఆక్సిజన్ సిలెండెర్స్ అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గారు, నాగరాజు, రమేష్ రెడ్డి, శ్రీనివాసు. ఎస్ ఆర్. వినయ్, నరేష్, రమేష్, గిద్ద సబ్ ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com