చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంతపురం పట్టణంలో ఘనంగా ప్రారంభమైన చిరంజీవి ఉచిత ఆక్సిజన్ బ్యాంక్. వారం రోజుల్లో ఆక్సిజన్ బ్యాంకు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేవలం నాలుగు రోజుల్లోనే యుద్ధ ప్రాతిపదికన ఈ ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభం అవడం విశేషమని జనసైనికులు అన్నారు. అనంతపురం జిల్లాలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పేద ప్రజలకి ఆక్సిజన్ ఉచితంగా ఇవ్వాలని సంకల్పంతో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలికారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి ఆక్సిజన్ బ్యాంకు అనంతపురంలోనూ మరియు గుంటూరులో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పేద ప్రజలకు పూర్తిగా ఉచితంగా ఇవ్వడానికి మాత్రమే ఈ యొక్క ఆక్సిజన్ బ్యాంకు పని చేయడం జరుగుతుంది. కావున ఆక్సిజన్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామని కోరారు. మెగాస్టార్ చిరంజీవి గారు మరియు రామ్ చరణ్ గారు నాయకత్వంలో స్వామి నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ ఆక్సిజన్ బ్యాంక్ 24 గంటలు 7 రోజులు (24/7) పని చేయబడును. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
హిందూపురం నియోజకవర్గం, కొండూరు గ్రామంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసైనికులు
అంబులెన్స్ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్
కర్నాటకలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు, సహకరించిన జనసైనికులు
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here