Logo
Date of Publish : 22 August 2022, 2:57 pm
Editor : Sake Naresh

చిట్వేల్ మండలంలో ఘనంగా చిరంజీవి గారి జన్మదిన వేడుకలు

          చిట్వేల్ ( జనస్వరం ) : చిట్వేలు మండలం చిరంజీవి యువత అధ్యక్షులు తుపాకుల పెంచలయ్య పురంసురేష్ ఆధ్వర్యంలో మారుమూల గిరిజన కాలనీ అయిన ఇందిరమ్మ st కాలనీలో 40 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాపు సంక్షేమ సేన కడప జిల్లా, అన్నమయ్య జిల్లా కోఆర్డినేటర్ మస్తాన్ రాయల్, ఉమ్మడి కడప జిల్లా చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు మాదాసు నరసింహ విచ్చేశారు. ఈ సందర్భంగా మస్తాన్ రాయల్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న నిరుపేదలకు సహాయం చేయడం కోసం తమ వంతుగా ఎల్ల వేళలా కృషి చేస్తామని తెలిపారు. అలాగే సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గిరిజనుల చేత కేక్ కటింగ్ చేపించి మిఠాయిలు పంచుకుని ఆనందంగా జరుపుకున్నారు. మాదాసు నరసింహ మాట్లాడుతూ సేవ చేయడానికి అధికారం అవసరం లేదని బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్ ఇలా చేతల్లో చేసి నిరూపించిన గొప్ప వ్యక్తి చిరంజీవి గారని అన్నారు. అలాగే గిరిజన వాసులు కూడా చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే గిరిజనులను గుర్తించి ఇంత దూరం వచ్చి సహయం అందించిన జనసేన పార్టీ నాయకులకు మరియు చిరంజీవి అభిమానులకు గిరిజనులు ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే చిట్వేలు చిరంజీవి యువత పట్టణ అధ్యక్షుడు పగడాల శివ ఆధ్వర్యంలో రాజారెడ్డి ఎస్టి కాలనీలో భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువ నాయకులు కంచర్ల సుధీర్ రెడ్డి, కడుమూరి నాగరాజా, మాదాసు శివ, మురళీకృష్ణ, కడుమూరి సుబ్రహ్మణ్యం, కొని శెట్టి, చక్రి, నాగిశెట్టి, నాగేంద్ర, చిరంజీవి సువ్వారపు భానుప్రకాశ్, సువ్వారపు హరిప్రసాద్, తుపాకుల శివ నవీన్ తుపాకుల నాగరాజా మరియు పల్లప్ప పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com