మంగళగిరి ( జనస్వరం ) : మంగళగిరి రత్నాల చెరువుకి చెందిన దుర్గ రావు వాళ్ళ పాపకి ఈ మధ్య కొత్తగా వచ్చిన వైరస్ సోకి నిమోనియాగా మారి ఊపితిత్తులు నిమ్ము చేరడం జరిగింది. ఇమ్మిడియట్ గా ట్రీట్మెంట్ చెయ్యాలి కనీసం 7 నుండి 8 లక్షలు వరకు ఖర్చు అవుతుందని విజయవాడ రెయిన్బో హాస్పిటల్ డాక్టర్స్ చెప్పడo జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పాపను హాస్పిటల్ కి వెళ్లి జనసేన పార్టీ తరపున చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు గారు ఆ పాప కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ పాప చికిత్స నిమిత్తం ఎటువంటి సహాయం అవసరం అయిన జనసేన పార్టీ మీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. అలాగే, పాప చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం అందించిన జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలకు చిల్లపల్లి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com