మంగళగిరి ( జనస్వరం ) : జనసేన పార్టీ మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మరియు తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావుఅధ్వర్యంలో జేపీ సంస్థ పేరు అనుమతి అయిపోయిన నిబంధనలకు విరుద్ధంగా గుండిమేడ ఇసుక క్వారీ లో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు పై తాడేపల్లి పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ వారం రోజుల క్రితం గుండిమేడ ఇసుక క్వారీ లో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు వెంటనే ఆపాలని డీఎస్పీ గారికి వినతి పత్రం అందించడం జరిగిందని, ఆయన రెండు మూడు రోజుల్లో విచారణ జరిపి నివేదిక అందజేస్తానని తెలియజేశారు. కానీ ఇప్పటికీ వారం రోజులైనా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇసుక తవ్వకాలు ఆపకుండా వారికి కాపలాగా పోలీసులు ఉంటూ ఇసుక తవ్వకాలు అడ్డుకున్న జనసేన నాయకులను మూడు రోజుల క్రితం అరెస్ట్ చేసి దుగ్గిరాల పోలీస్ స్టేషన్ కు తరలించారు. నేడు ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ చూస్తుంటే వైసీపీ కార్యకర్తల్లాగా, దొంగలకు కాపలాగా ఉంటూ ప్రజల సమస్యలను మాత్రం పట్టించుకోవట్లేదు. జేపీ సంస్థ పేరు అనుమతి అయిపోయిన నిబంధనలకు విరుద్ధంగా గుండిమేడ ఇసుక క్వారీ లో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు పై ఈ రోజున తాడేపల్లి పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగిందని, పోలీసు వారిని మాకు మూడు రోజుల్లోగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరామన్నారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారం రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలన్నీ తెలుసుకున్నారని, ఇప్పటికైనా పోలీసు వారు వెంటనే విచారణ జరిపి అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ నిరసన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారే పాల్గొనే అవకాశం ఉంటుందని అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, MTMC ఉపాధ్యక్షులు శెట్టి రామకృష్ణ, తాడేపల్లి మండల ప్రధాన కార్యదర్శి లాల్ చంద్, పెనుమాక గ్రామ అధ్యక్షులు గిరిబాబు, ఉండవల్లి గ్రామాధ్యక్షులు సిగిరిశెట్టి రాజా రమేష్, చిర్రావూరు గ్రామ ఉపాధ్యక్షులు అడపా విజయ్, ఉండవల్లి గ్రామ ప్రధాన కార్యదర్శి రాము, జనసేన పార్టీ యువ నాయకులు వెంకటేష్, పెనుమాక గ్రామ కమిటీ సభ్యులు, పెనుమాక గ్రామ జనసైనికులు, చిల్లపల్లి యూత్ సభ్యులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com