Logo
Date of Publish : 14 November 2025, 9:00 pm
Editor : Sake Naresh

ఘనంగా బాలల దినోత్సవం : వినూత్నంగా గొర్తి వెంకట్ రాక

అనంతపురం, నవంబర్ 14, జనస్వరం : జాతీయ బాలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 14న, మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తారని ప్రముఖ విద్యావేత్త, రాయలసీమ ప్రజాసమాఖ్య అధ్యక్షులు, కక్కలపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్తి వెంకటస్వామి అన్నారు. పిల్లల హక్కులు, విద్య, సంక్షేమంపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. నెహ్రు వేషధారణతో వచ్చిన గొర్తి వెంకట్ కు విద్యార్థులు వినూత్నంగా స్వాగతం పలికారు. ఆయన ఆధ్వర్యంలో శుక్రవారం కక్కలపల్లి ప్రాథమిక పాఠశాలలో చాచా నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత నెహ్రూ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పిల్లలను అమితంగా ప్రేమించేవారన్నారు. అందుకే ఆయనను 'చాచా నెహ్రూ' అని పిలుస్తామన్నారు. గతంలోభారతదేశంలో గతంలో నవంబర్ 20న బాలల దినోత్సవాన్ని నిర్వహించేవారని, ఇది ఐక్యరాజ్యసమితి బాలల దినోత్సవానికి అనుగుణంగా ఉండేదని చెప్పారు. 1964లో నెహ్రూ మరణం తర్వాత, పిల్లల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధతకు నివాళిగా ఆయన పుట్టినరోజు అయిన నవంబర్ 14కి మార్చారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ప్రపంచ బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న జరుపుకుంటాయన్నారు. ఇది ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల ప్రకటనను గుర్తుచేస్తుందన్నారు. అనంతరం పిల్లలందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com