తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు గ్రామంలో జనసేన నాయకుల సహాయంతో గ్రామంలోని ప్రతి ఇంటికి మాస్కులు పంపిణీ చేశారు. జనసేన నాయకులు దుర్గ భవాని శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ చాలా విభృంజిస్తోందని అన్నారు. గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు ఇస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేకపోయారని అన్నారు. మా గ్రామంలో కరోనా వైరస్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. అలాగే గ్రామం మొత్తం శానిటైజేషన్ చేస్తున్నామని తెలిపారు. అలాగే గ్రామంలో కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జనసేన పార్టీ ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మా గ్రామంలోని జనసేన నాయకులుయ్ అంతా కలసి ప్రతి ఇంటికి మాస్కులు ఇవ్వాలని నిర్ణయించుకొని అందజేశామన్నారు. ప్రజాసేవలో ఎప్పుడు జనసైనికులు ముందుంటారు అని అభినందిస్తున్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com