ధర్మవరం ( జనస్వరం ) : ముదిగుబ్బ మండలం రాళ్ల, అనంతపురం, సిద్ధన్నగారిపల్లి, బ్రహ్మదేవరమర్రి, గంగిరెడ్డిపల్లి, కొడవండ్లపల్లి, బూదనాంపల్లి, గ్రామాలలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి పర్యటించడం జరిగింది. జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, ప్రజలు, మహిళలు తండోపతండాలుగా విచ్చేసి హారతులు, పూలదండలు, డప్పులు, వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామాలలో పర్యటిస్తూ గ్రామ సమస్యలపై తెలుసుకుంటున్న క్రమంలో పలువురు వృద్ధులకు పెన్షన్ రాలేదని అలాగే గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్సలు బాగోలేదని వాపోయారు. జనసేన-తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వారి సమస్యలన్నీ తీరుస్తానని హామీ ఇచ్చారు. ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన పనులను ప్రజలకు వివరించి ధర్మవరంలో వైసీపీని గద్దె దించి జనసేన, తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిందిగా మధుసూదన రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ మండల కన్వీనర్ గుర్రం జయచంద్ర, ధర్మవరం రూరల్ కన్వీనర్ నాగ సుధాకర్ రెడ్డి, బత్తలపల్లి మండల కన్వీనర్ పుర్రం శెట్టి రవి, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, పట్టణ నాయకులు అడ్డగిరి శ్యామ్ కుమార్, కోటికి రామాంజి మరియు టీడీపీ నాయకులు వీరనారప్ప, శివయ్య, నాగరాజు, గంగాధర్, శంకర్, గంగయ్య, సీనప్ప, చంద్ర, గణేష్, పెద్దిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి, శంకర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, రామచంద్ర, గొంగటి గంగప్ప,జనగాని సుంకర, జనగాని వీరనారప్ప, పేరూరు శ్రీనివాసులు, తులవ దామోదర్, మిరియాల లక్ష్మీనారాయణ, దాడితోట కృష్ణయ్య, జనగాని మధు, మధుసూదన్ నాయుడు, ఐపర్స్ హరికృష్ణ, నరేంద్ర తిరుపాల్, మధు, విజయ్ కుమార్ అనిల్ కుమార్, వన్ను శ్రీరాములు, సాకే నరసింహులు, శివ శంకర్ రెడ్డి, మితిగొల్ల వెంకటరాముడు, కే.రాజేష్, కాశప్ప, ధారా గంగాధర్, గొంగటి హరి, చిలకం సుధాకర్ రెడ్డి, బాషా, కడపల సుధాకర్ రెడ్డి, తిమ్మారెడ్డి గారి బాబు రెడ్డి, మరియు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com