ధర్మవరం ( జనస్వరం ) : ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం పొట్లమర్రి గ్రామం వద్ద ఆక్సిడెంట్ జరిగింది. వివరాల్లోకి వెళ్తే బత్తలపల్లి నుంచి ధర్మవరంకు ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకొని వస్తుండగా ధర్మవరం వైపు నుంచి బులోరా వాహనం బత్తలపల్లి వైపు వస్తున్న క్రమంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం సమీపంలోని నాగుల కట్ట వద్దకు వెళ్ళగానే రెండు వాహనాలు ఢీకొనడం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న పేద కుటుంబాలు ఆరు మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి విచ్చేసి చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి చనిపోయిన గొట్లురూకు చెందిన ఈశ్వరయ్య, రాజేంద్రనగర్ కు చెందిన ఫయాజ్, శాంతినగర్ కు చెందిన అస్పిర్, కదిరిగేట్ కు చెందిన నరసింహులు, పోట్లమర్రి కు చెందిన మల్లేష్, నల్లకుంట్ల పల్లికు చెందిన నారాయణస్వామి గార్ల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 10/- వేల రూపాయల చొప్పున మొత్తం 60/- వేల రూపాయలను జనసేన పార్టీ తరపున ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అనంతరం మీడియా ముఖంగా మాట్లాడుతూ ఈ సంఘటన ఎంతో దురదృష్టకరమని వారందరూ కూలి చేసుకునే వారు కావడంతో ఈ ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని తక్షణమే 10 లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేయడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com