ధర్మవరం ( జనస్వరం ) : ధర్మవరం పట్టణం సత్య సాయి నగర్ కు చెందిన జనసేన పార్టీ కార్యకర్త చేనేత కార్మికుడు పోతిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి కు ఇటీవల మగ్గం ఎత్తుకొని వెళ్తూ ఉండగా కాలు క్రిందపడి కాలు ఫ్రాక్చర్ అయ్యింది. విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి శ్రీనాథ్ రెడ్డి ను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి, ఆరోగ్యం పట్ల పలు జాగ్రత్తలు చెప్పి జనసేన పార్టీ తరపున ఆసుపత్రి ఖర్చులకు గాను 5 వేల రూపాయలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి రామాంజనేయులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు లింగాల ప్రకాష్ రెడ్డి, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, ధర్మవరం రూరల్ మండల కన్వీనర్ D.నాగ సుధాకర్ రెడ్డి, కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు పేరూరు శ్రీనివాసులు, బండ్ల చంద్రశేఖర్, దాడితోట కృష్ణయ్య, మరియు కాశీమ్, సంజీవ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com