ధర్మవరం ( జనస్వరం ) : ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం మరవపల్లి గ్రామం కు చెందిన క్రియాశీలక సభ్యుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జనసైనికుడు ముక్కర రంగారెడ్డి గారి నివాసానికి వెళ్లి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పంపించిన 35,367/- రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్ చెక్కును రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి అందజేసారు. భవిష్యత్తులో కూడా తప్పకుండా జనసేన పార్టీ అన్ని విధాలుగా వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చి అలాగే ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త క్రియాశీలక సభ్యత్వ నమోదు చేయించుకోవాలని తెలియజేశారు. అనంతరం తాడిమర్రి మండలానికి చెందిన పార్టీ నాయకులతో పర్యటించి గ్రామ సమస్యలపై చర్చించడం జరిగింది.