ధర్మవరం ( జనస్వరం ) : సేవ్ ధర్మవరం కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి స్థానిక సిపిఐ కొట్టాల పరిసర ప్రాంతాల్లో ఇటీవల పర్యటించారు. ప్రజల నుంచి పలు సమస్యలను అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తన నివాసంలో సిపిఐ కొట్టాలకు చెందిన రంగం రామాంజనవ్ము ఇంటిలో విద్యుత్ సౌకర్యం లేదని చిలకం మధుసూదన్ రెడ్డికి తెలియజేసింది. దీంతో సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయగా మీ సొంత ఖర్చుతో విద్యుత్ పోల్‌ను ఏర్పాటు చేయించుకుంటే విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తామని విద్యుత్ అధికారులు సమాధానం ఇచ్చారు. దీంతో చిలకం మధుసూదన్ రెడ్డి తన నివాసంలో రంగం రామాంజనమ్మ దంపతులకు రూ 10 వేల రూపాయలను అందజేసి అవసరమైతే మరింత ఆర్థిక సాయం అందజేస్తానని హామీ ఇచ్చారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com