ధర్మవరం ( జనస్వరం ) : ధర్మవరం పట్టణంకు సంబంధించి బూత్ కమిటీలపై జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ధర్మవరం ఇంచార్జ్ చిలకం మధుసూదన రెడ్డి పార్టీ నాయకులతో, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రతి వార్డ్ లోను ఓటర్ జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి దొంగ ఓట్లను, డబుల్ ఓట్లను గుర్తించి వాటిని తొలగించే దిశగా సంబంధిత అధికారులు సూచించాలని తెలిపారు. అలాగే బాధ్యతగా అర్హులైన వారిని ఓటర్ జాబితా లోకి చేర్పించి, ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ఎదుర్కోవడానికి మనమంతా సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. పట్టణంలోని 104 బూతులకి ఓటర్ పరిశీల సభ్యులుగా పార్టీ నాయకులను ఏర్పాటు చేయడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com