మదనపల్లి ( జనస్వరం ) : రైతులకు ఉపయుక్తంగా గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేసేందుకు మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో ప్రతిపాదనలు పంపారు. ఆరు నెలల అవుతున్న ఇంతవరకు నిధులు మంజూరు కాలేదని, జిల్లాలోని చాలా పల్లెదారులు దెబ్బతిన్నాయని చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు. అన్నమయ్య జిల్లాలో రాజంపేట రాయచోటి లక్కిరెడ్డిపల్లె, రైల్వే కోడూరు, మొలకలచెరువు, అంగళ్ళు, మదనపల్లె, వాల్మీకిపురం, కలికి,రి పీలేరులో వ్యవసాయ కమిటీలు ఉన్నాయి. ఈ మార్కెట్ యార్డుల పరిధిలో 33 కోట్లతో 78 రోడ్లు 210 కిలోమీటర్లు మేరకు అభివృద్ధి చేసేందుకు పంచాయతీరాజ్ ఇంజనీర్లు అంచనాల తయారుచేసి ఇవ్వడంతో ఏఎంసీ అధికారులు నిధులు కోసం రాష్ట్ర అధికారులకు పంపారు. ప్రతిపాదించిన రోడ్లు రైతులు ఎక్కువగా వినియోగించుకుంటున్నవే.. అన్నదాతలు తమ ఉత్పత్తులను సులువుగా కమిటీలకు చేరవేసేందుకు సౌకర్యం ఉంటాది. ఇప్పటికే కమిటీల్లో గత మూడేళ్లుగా నిధులకు కేటాయింపులు లేవని పశు మానవ ఆరోగ్య వైద్య శిబిరాలు నిర్వహించకుండా మానేశారు. కనీసం రోడ్లైన బాగుపడితే చాలా అన్న రైతుల పోలిక ఫలించడం లేదు. ప్రజాపతినిధులు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలను కలిసినప్పుడు కూడా గ్రామీణ రోడ్ల దుస్థితిని వివరించారు. రాష్ట్ర అధికారులు మాత్రం నిద్ర మంజూరులో జాప్యం చేస్తున్నారు. 33 కోట్లతో ప్రతిపాదనలో ఉన్న ఆరు నెలలుగా మంజూరు కానీ నిధులను వెంటనే మంజూరు చేసి దెబ్బతిన్న రోడ్లను సరిచేయాలని జనసేన పార్టీ తరఫున కోరుతున్నామని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com