Logo
Date of Publish : 27 April 2023, 3:23 pm
Editor : Sake Naresh

ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసేందుకే ముఖ్యమంత్రి సభలు : జయరాం రెడ్డి

అనంతపురం ( జనస్వరం ) : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లాకు విచ్చేసి, నార్పల బహిరంగ సభలో వసతి దీవెన పథకాన్ని ప్రారంభించిన పథకాన్ని మరీ ప్రారంభిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ విద్యార్థులతో, నాయకులతో గొప్పలు చెప్పించుకుని పైశాచి ఆనందం పొందుతున్నారని అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి అన్నారు ఈ బహిరంగ సభకు SKU విద్యార్థులని, JNTU విద్యార్థుల్ని, అనంతపురం జిల్లా వ్యాప్తంగా విద్యార్థులందరినీ బలవంతంగా తరలించి... విద్యార్థులకు సరైన వసతులు కల్పించకుండా ఒకరిద్దరు అస్వస్థకు గురి అయినారని ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్న దశలో విద్యార్థుల పరీక్షా కాలంలో మరీ ముఖ్యంగా పరీక్షలను అనంతపురం జిల్లాకు చెందిన విద్యాశాఖ అధికారులు వాయిదా వేసి విద్యార్థుల్ని బహిరంగ సభలకు తరలించడం దుర్మార్గమైన చర్య. యూనివర్సిటీలకు చెందిన విసిలు, విద్యాశాఖ అధికారులు అందరూ వైసిపి కార్యకర్తల్లాగా ప్రవర్తించడం సిగ్గుచేటు. వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వైసిపి నాయకులందరికీ సరైన ఇంగిత జ్ఞానం లేకుండా విద్యార్థుల ముందర రాజకీయాలు ప్రస్తావన చేయడం... ప్రతిపక్షాలను విమర్శించడం నీచమైన హేయమైన చర్య... జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లా ద్రోహని ఈ సభ ద్వారా మరొక మారు నిరూపించుకున్నారు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించలేదు, కనీసం ఎన్నికల తరంలోనైనా జిల్లాకు లబ్ధి చేకూరుస్తారనుకుంటే ఏమీ చేకూర్చకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. అనంతపురం కరువు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వైసిపి నాయకులు అనంతపురం జిల్లా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సాధించడంలో పూర్తిగా విఫలమైనారు అని ఈ బహిరంగ సభ ద్వారా తేటతెల్లమైపోయిందని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com