అనంతపురం ( జనస్వరం ) : రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలు కష్టాల్లో ఉంటే గాలికొదిలేశారని.. వరద బాధితులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అనంత జిల్లా జనసేన నాయకులు మండిపడ్డారు. మంగళవారం స్థానిక సప్తగిరి సర్కిల్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ ఆదేశాల మేరకు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ... గత వారం నుంచి కురుస్తున్న అకాల వర్షాల బీభత్సానికి అతలాకుతలమైన పంటల్లో ముఖ్యంగా వరి, వేరుశనగ, మిరప, పత్తి పంటలు పూర్తిగా నీట మునిగిపోయాయి అన్నారు. దీని వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు 35 వేల రూపాయల చొప్పున వెంటనే పంట నష్ట తక్షణ సహాయం చేయాలని వైసిపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులను గాలికి వదిలేసి పక్క రాష్ట్రాల విందు వినోదాల్లో పాల్గొంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చర్య విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని.. లేకపోతే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రైతుల తరపున ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం అవుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి కే.నాగేంద్ర, కార్యదర్శి రపా ధనుంజయ్, చొప్ప చంద్రశేఖర్, ఇండ్ల కిరణ్ కుమార్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com