Logo
Date of Publish : 30 July 2022, 12:15 pm
Editor : Sake Naresh

కాపులను అవహేళన చేసిన ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి : జనసేన నాయకులు మత్స పుండరీకం

● కాపు నేస్తంకి కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నాయకులు పేరు ఎందుకు పెట్టలేదు?

● కాపు నేస్తం కి వై.ఎస్.ఆర్ కాపు నేస్తం అని పేరు ఎందుకు పెట్టారు?

● సీఎం జగన్ మొదటినుంచి కాపులను కించపరచడమే ఆయన నైజం

● కాపులు అమ్ముడుపోతారని చెప్పడం సిగ్గుచేటు

● సీఎం జగన్ రెడ్డి కాపుల మనోభావాలు దెబ్బ తీశారు.

         పాలకొండ, (జనస్వరం) : మొదటి నుంచి కాపులను కించపరచడానికి వారిని అవహేళన చేయడానికి మాత్రమే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు మత్స పుండరీకం వ్యాఖ్యానించారు. కాపు నాయకులను వైసీపీ పార్టీలోని అదే సామాజిక వర్గం వారితో ఇష్టానుసారం తిట్టించి ఆనందం పొందటం జగన్ రెడ్డికి మొదటి నుంచి అలవాటే అని పుండరీకం అన్నారు. ఈ సందర్భంగా మత్స పుండరీకం మాట్లాడుతూ కాపునేస్తం విడుదల చేయడానికి వచ్చిన ముఖ్యమంత్రి ఆ పనిని పూర్తిగా పక్కన పెట్టేశారు. కాపులపై తనకున్న కోపాన్ని ప్రదర్శించడానికి ఈ సభను వాడుకున్నారు. కాపులకు సంబంధించిన కార్యక్రమంలో వారి మనోభావాలు కించపరిచేలా మాట్లాడారు. నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ ఇష్టానుసారంగా కాపులపై తనకు ఉన్న చిన్న చూపును బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. కాపులు ఓట్లు అమ్ముకునే వారని ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాట్లాడడం అత్యంత బాధాకరం. జనాభాలో అత్యంత ఎక్కువగా ఉండే కాపులు ఎప్పుడు ఓట్లు అమ్ముకున్నారో ముఖ్యమంత్రి రుజువు చేయాలి. లేకుంటే మొత్తం కాపు జాతికి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి. మీ పార్టీ అభ్యర్థులు కాపుల ఓట్లతో గెలవలేదా? అలా గెలవలేదు అని వారు చెప్పగలరా? గత ప్రభుత్వాలు సైతం కాపులకు అన్యాయం చేశాయి. ఇప్పుడు కూడా కాకి లెక్కలతో కాపులను మభ్య పెడుతున్నారు.
● జనాలను మోసం చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం
     రాష్ట్ర భవిష్యత్ తాకట్టు పెట్టి నిధులు తెచ్చి పథకాలను నిర్వహిస్తున్నారన్నారు. దీని వల్ల భవిష్యత్ అంధకారం తప్పదు. సీఎం జగన్ రెడ్డి సభలకు వలంటీర్లు బలవంతంగా ప్రజలను సభకు తరలిస్తున్నారు. ప్రతి ఒక్కరికి టార్గెట్లు పెట్టి మరి జన సమీకరణ చేయడం సిగ్గుచేటు. కాపులను విమర్శిస్తుంటే వైసీపీ కాపు నాయకులు ఎందుకు స్పందించలేదు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు జనసైనికులు ముందున్నాం. పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి సీఎంకి గాని, వై.ఎస్.ఆర్. సీపీ నాయకులకు కనీస అర్హత లేదు. కాపు నేస్తం లిస్టుల్లో ఉన్న గందరగోళం తొలగించి కాపుల సంక్షేమానికి ఎంత కేటాయించరో లెక్కలు చెప్పాలి" అని పుండరీకం ప్రశ్నించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com