రాష్ట్ర ప్రభుత్వం ఈమధ్యనే నిరుద్యోగుల కోసం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ను రద్దు చేయాలని కలక్టరేట్ జంక్షన్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షను చేపట్టారు. ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు లక్షల్లో ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ మాట మరిచారని జనసేనపార్టీ సీనియర్ నాయకులు శ్రీ ఆదాడ మోహనరావు ఆరోపించారు. ముఖ్యమంత్రి విడుదల చేసిన జాబ్ కేలండర్ ను నిరసిస్తూ కలక్టరేట్ దగ్గర చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటికి పైగా నిరుద్యోగులు ఉంటే ప్రభుత్వం మాత్రం వందల్లో కూడా ఉద్యోగాలను భర్తీ చేయలేకపోయిందని విమర్శించారు. ఆయన అధికారంలోకి వస్తే ఏటా లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన జగన్ రెడ్డి ఈరోజు ఆ మాట దాటవేస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి ఆదాయ వనరులను కల్పించకుండా సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేస్తూ ఆ భారాన్ని మళ్ళీ పన్నుల పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారని అన్నారు. మరో జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న ఉద్యోగస్తులకే జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఎన్నో సంవత్సరాల బకాయిలు కూడా ఇప్పటికీ చెల్లించలేని పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వం ఉందని, అలాంటప్పుడు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ప్రజలకుమోసం చేస్తున్నారని విమర్శించారు. అలాగే రిలీజ్ చేసిన జాబ్ కేలండర్ రద్దు చేసి, ఎన్నికలకు ముందు ఇచ్జిన మాట ప్రకారం ఉద్యోగాలను యువతకు ఇచ్చి మాట నిలబెట్టుకొకపోతే ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఓటుతో మీకు బుద్ది చెప్తారని హితవు పలికారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఝాన్సీ వీరమహిళ శ్రీమతి తుమ్మి లాక్ష్మీరాజ్ , జనసేన పార్టీ నాయకులు రవిరాజ్ చౌదరి గారు, బూర్లీ వాసు గారు, డోల రాజేంద్ర ప్రసాద్ గారు, భాస్కర్ గారు, జొయ్ గారు, అడబాల వెంకటేష్ గారు తదితరులు జనసేన నాయకులు పాల్గొన్నారు.