Logo
Date of Publish : 03 March 2022, 12:52 pm
Editor : Sake Naresh

అమరావతి రైతులకు… రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలి – శ్రీ నాదెండ్ల మనోహర్ గారు

    అమరావతి, (జనస్వరం) : రాజధాని అమరావతిపై గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పును జనసేన పార్టీ స్వాగతిస్తోంది. ఈ తీర్పు రాష్ట్ర ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపింది. ఇప్పటికే పునాదులు వేసి, అభివృద్ధి జరిగిన ప్రాంతాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిన సమయంలో హైకోర్టు న్యాయమూర్తులు తీర్పుతో రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత వాతావరణంలో ఉండాల్సిన పరిపాలన మన రాష్ట్రంలో శ్రీ జగన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరంకుశ ధోరణిలో సాగుతోంది. ప్రతి ఒక్కరికీ ఆయన పాలన తీరు అర్థమవుతోంది. ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి అమరావతి రైతులకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.

● మూర్ఖపు నిర్ణయంతో రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడులు తరలిపోయాయి.

ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే.. రాజధానిపై తీసుకున్న మూర్ఖపు నిర్ణయం కారణంగా మన రాష్ట్రానికి రావాల్సిన దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లిపోయాయి. అమరావతిని అభివృద్ధి చేసుకుని ఉంటే అది చూసి ఎంతో మంది పెట్టుబడులు పెట్టడానికి తరలివచ్చేవారు. ఆ పరిస్థితులు లేకుండా చేశారు. ఇతర దేశాల్లో నివసిస్తున్న మన తెలుగు ప్రజలు, యువత మన రాజధాని, మన ఆంధ్రప్రదేశ్, మన అమరావతి అంటూ మనమంతా గర్వించే రీతిలో రాజధాని వస్తుందని ఇక్కడ పెట్టుబడులు పెట్టి భూములు కొనుక్కున్నారు. అమరావతి ప్రాంతంలో ఒక ఇల్లు కట్టుకుందాం.. కార్యాలయం పెట్టుకుని వ్యాపారం చేద్దాం అన్న నమ్మకంతో వీరంతా ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరినీ అవమానపరిచే విధంగా.. ఇక్కడ ఏదో పెద్ద స్కామ్ జరిగిపోయిందనే విధంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ది చెందనీయకుండా కించపరిచే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన కొనసాగించింది.

 ● కంచెలు వేసి అడ్డంకులు సృష్టించారు.

శ్రీ జగన్ రెడ్డి గారి పరిపాలన రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను కించపరిచే విధంగా, మహిళలను అవమానపరిచే విధంగా సాగింది. ప్రజలు, రైతుల కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్లిన సమయంలో కూడా ఎన్నో అడ్డంకులు సృష్టించారు. కంచెలు వేసి లాఠీఛార్జ్ లు చేసే పరిస్థితిని తీసుకువచ్చింది. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడ్డారు. ఆ ప్రాంతవాసుల్లో ధైర్యం నింపారు. కేంద్ర ప్రభుత్వంతో గానీ, బీజేపీ నాయకులతో గాని జరిగిన మా ప్రతి చర్చలోనూ అమరావతి మొదటి అంశంగా ఉండేది. మంచి మనసుతో మన రాష్ట్రానికి రాజధాని కావాలని, విభజన తర్వాత ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశ్యంతో కుటుంబ సభ్యులను సైతం కాదని ఆ రోజున అమరావతి ప్రాంత రైతులు రాష్ట్ర ప్రజల కోసం దాతలుగా నిలబడ్డారు. అలాంటి వారిని శ్రీ జగన్ రెడ్డి గారు పిలిపించి కనీసం చర్చలు కూడా జరపలేదు. ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది. న్యాయం నిలబడుతుందన్న నమ్మకంతో 807 రోజుల నుంచి రైతులు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో చాలా కష్టాలుపడ్డారు. వారికి ధైర్యం నింపేందుకు ఎంతోమంది ముందుకు వచ్చారు. అంతిమంగా న్యాయాన్ని, ధర్మాన్ని నమ్ముకున్న వారు విజయం సాధిస్తారు. దానికి కట్టుబడి ఈ రాష్ట్ర ప్రజలు ముందుకు వెళ్లాలి. మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. భవిష్యత్తులో ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రాంతం నుంచి వెనక్కి పంపేందుకు అంతా సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాం.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com