● రాజకీయ లబ్ధి కోసం సొంత బాబాయినే చంపించారు
● అంబానీల దగ్గర ప్యాకేజీ తీసుకొనే పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు ఇచ్చారు
●తుని, అమలాపురం ఘటనల వెనక ఉన్నది వైసీపీ గూండాలే
●పవన్ కళ్యాణ్ సన్మానాలు చేసింది రౌడీలకు కాదు… పోరాటపటిమ ఉన్న నేతలకు
●18 నెలలు జైల్లో ఉన్న నాయకుడి కింద పని చేస్తున్నందుకు వైసీపీ వాళ్ళు సిగ్గుపడాలి
● అంబటి రాంబాబు ‘ఆనంద్ నగర్ రాసలీలలు’ త్వరలో బయటపెడతాం
● జనసేనపార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్
ఒంగోలు, (జనస్వరం) : రాష్ట్రంలో గూండాలను, రౌడీలను కాపాడుతూ వారికి కొమ్ము కాస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డేనని జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ఇంఛార్జి షేక్ రియాజ్ ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక పాత్ర ఉందని రిలయన్స్ సంస్థలపై దాడి చేయించిన జగన్ అధికారంలోకి వచ్చాక అంబానీల దగ్గర ప్యాకేజి తీసుకొని పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు కట్టబెట్టారన్నారు. ఎంపీ సీటు కోసం సొంత బాబాయినే పొట్టన పెట్టకున్న చరిత్ర వైసీపీ అధినాయకుడుదని, ఈ విషయం వై.ఎస్.షర్మిల స్వయంగా చెబుతుందని అన్నారు. మహిళా మంత్రులపై దాడి చేయడం తప్పు అని చెప్పకుండా జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ సన్మానాలు చేయడం ఏంటని మాజీ మంత్రి, తాడేపల్లి ప్యాలెస్ పెంపుడు కుక్క పేర్ని నాని మాట్లాడం విడ్డూరంగా ఉందని అన్నారు. అవినీతి కేసుల్లో 18 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి కింద పని చేస్తున్న మీకే సిగ్గు లేనప్పుడు, మీరు పెట్టిన అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటూ బెయిల్ పై బయటకు వచ్చిన వారికి సన్మానం చేయడం తప్పా అని ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్ జనసేన కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా షేక్ రియాజ్ మాట్లాడుతూ “జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సన్మానం చేసింది. మర్డర్లు చేసిన గూండాలు, దౌర్జన్యాలు చేసిన రౌడీలకు కాదు. పోరాట పటిమ ఉన్న నేతలకు. చేయని తప్పుకు వైసీపీ నాయకులు పెట్టిన అక్రమ కేసుల్లో ఇరుకున్న నిజాయితీ గల జనసేన నాయకులు వారు. విశాఖ ఘటనలో అరెస్టు అయిన జనసేన నాయకులు విమానాశ్రయంలో దాడులు చేసినట్లు ఒక్క ఫ్రూప్ అయినా వైసీపీ నాయకులు చూపించగలరా?
● టీడీపీతో కలిసుంటే అధికారంలోకి వచ్చేవారా?
హుందాతనాన్ని వదిలేసి చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని తాడేపల్లి ప్యాలెస్ కుక్క పేర్ని నాని మాట్లాడుతున్నాడు. ఆ కుక్కకు మేము ఒకటే చెబుతున్నాం. అసలు దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ పార్టీయే. చంద్రబాబుకు, జనసేన పార్టీకి సంబంధం ఏంటి? లేచింది మొదలు పవన్ కళ్యాణ్ మీద అవాకులు చవాకులు పేల్తారు. ఈ మూడున్నరేళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించినందుకు ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అన్యాయాలు, అవినీతిని మంగళగిరి వేదికగా ఎండగట్టింది మా నాయకుడే. మేమే గనుక నిజంగా టీడీపీతోనే కలిసి ఉంటే 2019లో మీరు అధికారంలోకి వచ్చేవారా? 151 ఎమ్మెల్యే సీట్లు గెలిచేవారా? రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన ఎదగడం ఖాయం. అధికార పార్టీ అవినీతిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టడం ఖాయం.
● మీ గూండాలు ఉన్నారు కనుకే కేసులు వెనక్కి తీసుకున్నారు
తుని రైలు ఘటనలో పెట్టిన కేసులు వైసీపీ వెనక్కి తీసుకుందని గొప్పగా చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ కేసులను ఎందుకు వెనక్కి తీసుకున్నారో ప్రజలకు తెలియదా? ఆనాడు తునిలో రాయలసీమ ఫ్యాక్షన్ గూండాలను దింపి రైలు తగలబెట్టారు. వారిని తప్పించడానికి అధికారంలోకి రాగానే కేసులు వెనక్కి తీసుకున్నారు. వాస్తవంలో ఇప్పటికీ కాపులు రైల్వే కేసులతో విజయవాడ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. తునిలో పోలీస్ స్టేషన్ కేసులలో ఉన్న వైసీపీ తిరుపతి గూండాలను మాత్రం తప్పించారు.
● అతని చరిత్ర అదే
మొదట నుంచి వైసీపీ అధినాయకుడు చరిత్ర ఇదే కదా. హైదరాబాద్ లో మతకల్లోలం సృష్టించడం వెనుక ఆయన తండ్రి వై.ఎస్.ఆర్. లేడా? నిన్నటికి నిన్న అమలాపురంలో అలజడి సృష్టించడం వెనుక వైసీపీ నాయకులు లేరా? ఎస్సీ మంత్రి పినిపె విశ్వరూప్ ఇంటిని తగలబెట్టింది, బీసీ ఎమ్మెల్యే సతీష్ ఇంటిపై దాడి చేసింది వైసీపీ నాయకులేనని ఆడియో టేపులతో సహ బయటకు వచ్చాయి. ఈ ఘటనలో మంత్రి విశ్వరూప్ అనుచరులను నిందితులుగా పేర్కొంటూ పోలీసులు కేసులు నమోదు చేయలేదా? ఎటువంటి పదవి లేకపోయినా నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. నిజంగా ఆయన నాయకత్వంలో పనిచేయడం మేము గర్వంగా భావిస్తున్నాం. మీరు 18 నెలల జైల్లో ఉన్న వ్యక్తి కింద పనిచేస్తున్నాం అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. మీలాంటి వ్యక్తులా పవన్ కళ్యాణ్ గారించి మాట్లాడేది. మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడం మానేసి బందరు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టండి. చిన్నపాటి వర్షానికే బందరు మునిగిపోతుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
●6093 నెంబర్ రాష్ట్రాన్ని ముంచేసింది
చంచల్ గూడ జైల్లో ఉన్నప్పుడు వైసీపీ అధినేతకు ఖైదీ నెంబర్ 6093 ను కేటాయించారు. ఈ నెంబర్ ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆయన రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. 6 అంకెకు అనుగుణంగా ఒక ముఖ్యమంత్రి అయిదుగురు ఉపముఖ్యమంత్రులు, 0 అంకెకు అనుగుణంగా రాష్ట్రాభివృద్ధిని శూన్యం చేశారు. 9కి అనుగుణంగా నవరత్నాలు పేరిట ప్రజలను నయవంచనకు గురిచేశారు. 3 అంకెకు అనుగుణంగా మూడు రాజధానులను తీసుకొచ్చి ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టారు. కర్నూలుకు హైకోర్టు ఇచ్చేస్తే రాయలసీమ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందా? ఈ మూడున్నరేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏంటో శ్వేతపత్రం విడుదల చేయగల దమ్ముందా? కాపు పుట్టుక పుట్టిన పేర్ని నాని కనీసం ఈ మూడున్నరేళ్లలో కాపుల సంక్షేమానికి వైసీపీ ఏం చేసిందో చెప్పగలరా?
● అంబటి యవ్వారాలు అందరికీ తెలుసు
మరో మంత్రి అంబటి ఈ మధ్య ట్విట్టర్ వేదికగా రెచ్చగొడుతున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పు చూపించారు అని అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డే చెప్పాడు.. అధికార పార్టీ నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే చెప్పులు, చీపుర్లతో బుద్ధి చెప్పాలని. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అదే చేస్తున్నారు. చెప్పు చూపిస్తే మీకు అంత భయమెందుకు? పవన్ కళ్యాణ్ ఏదైనా మాట్లాడితే మూడు పెళ్లిళ్లు అని మాట్లాడుతున్నారు. ఆయన న్యాయబద్దంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. అంబటి రాంబాబు బాగోతం ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. హైదరాబాద్ ఆనందనగర్ కాలనీలో ఆయన ఎంతమందితో రాసలీలలు చేశారో ఆ చిట్టా మా దగ్గర ఉంది. అన్ని త్వరలోనే బయటకు వస్తాయి” అన్నారు.