వేమూరు ( జనస్వరం ) : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని చెప్పకుండా, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం శోచనీయమని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సోమరౌతూ అనురాధ విమర్శించారు. వేమురులో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గృహ నిర్మాణాల ప్రారంభోత్సవం సందర్భంగా తాను చేసిన అభివృద్ధిపై కాకుండా ప్రతిపక్షాలపై విమర్శలకు దిగటం దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. పదేపదే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారని తెలుగుదేశం జనసేన కలయికతో ముఖ్యమంత్రి కి మతిభ్రమించిందని ఎద్దేవా చేశారు. నిజంగా రాష్ట్ర అభివృద్ధికి ప్రజల అభివృద్ధికి పాటుపడితే నీవు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి కానీ జనసేన టిడిపి పొత్తు గురించి, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతకు భయపడుతున్నారని అందుకే ఏం మాట్లాడాలో తెలియక అనవసరమైనటువంటి, ప్రజలకు ఏమాత్రం అవసరం లేనటువంటి విమర్శలు చేస్తున్నారని అనురాధ పేర్కొన్నారు. ఇకనైనా ఇటువంటి అనవసరం మైనటువంటి విమర్శలు మాని ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను గురించి మాట్లాడాలని హితవు పలికారు. సమావేశంలో పార్టీ నాయకులు బ్రహ్మం, ఎంపీటీసీ గాజుల నగేష్ తదితరులు ఉన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com