Logo
Date of Publish : 13 October 2023, 9:30 pm
Editor : Sake Naresh

ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత విమర్శలు చేయడం శోచనీయం

        వేమూరు ( జనస్వరం ) : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని చెప్పకుండా, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం శోచనీయమని  జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సోమరౌతూ అనురాధ విమర్శించారు. వేమురులో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గృహ నిర్మాణాల ప్రారంభోత్సవం సందర్భంగా తాను చేసిన అభివృద్ధిపై కాకుండా ప్రతిపక్షాలపై విమర్శలకు దిగటం దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. పదేపదే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారని తెలుగుదేశం జనసేన కలయికతో ముఖ్యమంత్రి కి మతిభ్రమించిందని ఎద్దేవా చేశారు. నిజంగా రాష్ట్ర అభివృద్ధికి ప్రజల అభివృద్ధికి పాటుపడితే నీవు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి కానీ జనసేన టిడిపి పొత్తు గురించి, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతకు భయపడుతున్నారని అందుకే ఏం మాట్లాడాలో తెలియక అనవసరమైనటువంటి, ప్రజలకు ఏమాత్రం అవసరం లేనటువంటి విమర్శలు చేస్తున్నారని అనురాధ పేర్కొన్నారు. ఇకనైనా ఇటువంటి అనవసరం మైనటువంటి విమర్శలు మాని ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను గురించి మాట్లాడాలని హితవు పలికారు. సమావేశంలో పార్టీ నాయకులు బ్రహ్మం, ఎంపీటీసీ గాజుల నగేష్ తదితరులు ఉన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com