అనంతపురం ( జనస్వరం ) : అప్పుల ఊబిలో కూరుకుపోయి.. దిక్కు తోచని స్థితిలో బలవన్మరణాలకు పాల్పడిన కవులు రైతులను అక్కున చేర్చుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్నదాతలను ఆదుకొని వ్యవసాయాన్ని పండుగ చేస్తారని జిల్లా అధ్యక్షులు, అనంతపురము అర్బన్ ఇంచార్జ్ టీ.సి.వరుణ్ గారు అన్నారు. జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు గార్ల పిలుపు మేరకు నారాయణపురం పంచాయతీలో టి.సి.వరుణ్ గారి ఆధ్వర్యంలో పంట పొలాలను పరిశీలించారు. చీని తోట, కంది చేను, వరిమడి, మిరప, టమోటా పొలాలను సందర్శించి.. రైతులతో కలిసి దుక్కిదున్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు పంట నష్టపరిహారం, గిట్టుబాటు ధరలు, కల్తీ విత్తనాలు, ఎరువుల ధరల పెంపు తదితర సమస్యలను శ్రీ టి.సి.వరుణ్ గారికి వివరించారు. అనంతరం మాట్లాడుతూ… విత్తన పంపిణీ మొదలు చివరి గింజ కొనుగోలు వరకు రైతు భరోసా కేంద్రాలు చూసుకుంటాయని ముఖ్యమంత్రి మభ్య పెట్టారన్నారు. గ్రామాల్లో ఉన్నవి రైతు భరోసా కేంద్రాలు కాదని.. అవి రైతు మోస కేంద్రాలు అన్నారు. విత్తన పంపిణీ లేదు.. పంట పెట్టేందుకు సహకారం అందించారు.. అతివృష్టి అనావృష్టిని దాటుకొని పంట చేతికొస్తే గిట్టుబాటు ధర కల్పించారు. మరి ఇవి రైతు మోస కేంద్రాలు కాక ఏమనాలో వైసిపి పెద్దలే చెప్పాలని ప్రశ్నించారు. రైతాంగాన్ని నట్టేట ముంచిన ఈ వైసీపీ ప్రభుత్వానికి రైతులే నడ్డి విరిచే సమయం ఆసన్నమైందన్నారు. రైతుల పక్షాన జనసేన నిలుస్తుందని.. కౌలు రైతులను ఏ విధంగా ఆదుకున్నామో.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత యావత్తు రైతాంగాన్ని అభివృద్ధి పథాన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నడిపిస్తారని టీ.సీ.వరుణ్ గారు భరోసా ఇచ్చారు. అనంతరం జాతీయ రైతాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ… రైతులకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి, వారికి భోజన వసతి కల్పించారు. కార్యక్రమంలో మరియు తదితరులు పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, అంకె ఈశ్వరయ్య, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు మురళి కృష్ణ, నగర ఉపాధ్యక్షులు జక్కిరెడ్డి ఆదినారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శిలు పత్తి చంద్రశేఖర్, కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యదర్శులు కిరణ్ కుమార్, విజయ్ కుమార్, ముప్పురు కృష్ణ, నగర ప్రధాన కార్యదర్శిలు మేదర వెంకటేష్, దరాజ్ భాష, మురళి, లాల్ స్వామి, సంపత్, జక్కిరెడ్డి పద్మ, సువర్ణమ్మ, రూప, అనసూయ, వెంకటరమణ, నెట్టిగంటి హరీష్, ఆకుల అశోక్, నాయకులు రామ్మోహన్, చిరు, పవనిజం రాజు, వడ్డే వెంకటేష్, నజీమ్, హిద్దు, మళ్లీ, నౌషాద్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.