Logo
Date of Publish : 30 July 2022, 4:42 pm
Editor : Sake Naresh

పరామర్శకు వెళ్లి పళ్లు ఇకిలించే ముఖ్యమంత్రి బటన్ రెడ్డి : జనసేన నాయకులు షేక్ రియాజ్, సుందరపు విజయ్ కుమార్ 

● కాపులపై జగన్ రెడ్డిది కపట ప్రేమ
● కాపులకు ఈబీసీ రిజర్వేషన్ తొలగించిన ద్రోహి జగన్
● కాపు కార్పొరేషన్ కు ఏటా ఇస్తామన్న రూ. 2 వేల కోట్లు ఏమైయ్యాయి?
● కాపు సంక్షేమానికి వెచ్చించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయండి
● కాపులు అమ్ముడుపోతారని సీఎం మాట్లాడుతుంటే వేదికపై ఉన్న కాపు నాయకులకు పౌరుషం రాలేదా?
● మీడియాతో మాట్లాడిన జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, సుందరపు విజయ్ కుమార్

      ప్రకాశం, (జనస్వరం) : జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, విజయ్ కుమార్ మాట్లాడుతూ... “కాపు సామాజిక వర్గంతోపాటు రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది. కులం చూడం... మతం చూడం... ప్రాంతం చూడం.. అని పెద్ద పెద్ద మాటలు చెప్పిన ముఖ్యమంత్రి బటన్ రెడ్డి... అన్ని వర్గాలను నిలువునా ముంచారు. కాపు నేస్తం కార్యక్రమంలో కాపులు అమ్ముడుపోతారని బటన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే వేదికపై ఉన్న కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు మెదపకపోవడం సిగ్గు చేటు. వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లి పళ్ళు ఇకిలించే వ్యక్తి మన రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి బటన్ రెడ్డి మాత్రమే.
● కాపు సామాజిక వర్గ విలేకరి హత్య కేసులో మంత్రి రాజా నిందితుడు
     జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై ముఖ్యమంత్రి అవాకులుచవాకులు పేలుతుంటే అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి దాడిశెట్టి రాజా వత్తాసు పలుకుతూ మాట్లాడారు. రాజ్యాధికారం కోసం కాపులు జనసేన వెంట నడుస్తుంటే... అదే సామాజిక వర్గానికి చెందిన విలేకరి కాటా సత్యనారాయణను మంత్రి రాజా చంపించిన మాట వాస్తవం కాదా? అరకు నుంచి గంజాయిని తెప్పించి తుని నియోజకవర్గంలో నిల్వ చేసి వివిధ ప్రాంతాలకు తరలించే పనిలో రాజా పాత్ర ఉన్న మాట వాస్తవం కాదా? దాడిశెట్టి రాజా, అతని కుటుంబం చేసే దొంగ బంగారం వ్యాపారం గురించి నియోజకవర్గంలో కథలు కథలుగా చెబుతారు. మంత్రివర్గంలో అత్యంత వ్యసనపరుడు ఎవరు అని చేతులు ఎత్తమంటే రెండు చేతులూ ఎత్తగల ఘనుడు దాడిశెట్టి రాజా. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి సభకు రెండు పెగ్గులు ప్రెసిడెంట్ మెడల్ వేసుకొని వెళ్లి ఉంటాడని అనిపిస్తోంది” అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com